కేన్సర్‌ మందులో కరోనా ఖతం

 

కరోనా నివారణకు వ్యాక్సిన్లు సిద్ధం అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి చాలాకాలం సమయం పట్టొచ్చు. ఈలోగా కరోనా తన ప్రతాపం ఎన్ని విధాలుగా మార్చుకుంటుందో అని చాలా మంది భయపడుతున్నారు. అయితే కరోనా నివారణకు మరో మందును చైనా వైద్యులు కనిపెట్టారు. లింఫో మస్‌ కేన్సర్‌ చికిత్స కోసం కొన్నేళ్ళుగా ఉపయోగిస్తున్న ‘ప్రలేట్రేక్సేట్‌ ‘ మందును వినియోగించి కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వైద్యులు ప్రకటించారు. చైనాలోని షెంజెన్‌ ఇనిస్టి ఆఫ్‌ అడ్వాన్స్‌ డ్‌ టెక్నాలజీకి చెందిన డాక్టర్‌ హైపింగ్‌ జంగ్‌ ఆధ్వర్యంలోని బందం ఈ మందుపై విస్తతంగా పరిశోధన జరిపి ఈ విషయాన్ని కనుగొనింది. ప్రస్తుతం కరోనా బారిన పడ్డవారికి రెమ్‌ డేసివిర్‌ మందుగా ఇస్తూ వస్తున్నారు. అయితే ఆ మందు కన్నా కరోనాను నియంత్రించడంలో ప్రలేట్రేక్సేట్‌ కొన్ని రెట్లు మెరుగ్గా పని చేస్తోందని చైనా వైద్య బందం గుర్తించింది. ప్రలేట్రేక్సేట్‌ మందును వినియోగించేవారికి అలసట అల్సర్‌ రావడం కడుపులో మంట వికారం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ మందు ద్వారా తలెత్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ని కంట్రోల్‌ చేయగలిగే పరిశోధనలు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చైనా వైద్య బందం ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రలేట్రేక్సేట్‌ కేన్సర్‌కి మందుగా వినియోగించడానికి 2009 లోనే అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ మందును కేన్సర్‌ వ్యాధిగ్రస్తులకు విరివిగా వినియోగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *