దేశవ్యాప్తంగా 37 వ్యాక్సిన్‌ కేంద్రాల ఏర్పాటు

 

దేశవ్యాప్తంగా మొత్తం 37 వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. ఆయా కేంద్రాల నుంచి వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని తెలిపారు. అత్యవసర వినియోగ నిమిత్తం భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్‌’ టీకాలకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ముంబై, చెన్నై, కోల్‌కతా, కర్నాల్‌ (హర్యానా) నగరాల్లో ప్రధాన వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. వీటితో పాటు కేంద్ర ఔషధ నిల్వ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరిన్ని వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేంద్రాల్లో నిల్వ ఉంచిన వ్యాక్సిన్లను, వాటి ఉష్ణోగ్రతలను సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుందని రాజేశ్‌ భూషణ్‌ వివరించారు. 10 రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలవుతుందని ఆయన తెలిపారు. జనవరి 13లోగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన మంగళవారం వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *