ప్రముఖ టాలీవుడ్ రచయిత మృతి

ప్రముఖ సినీ గేయ, మాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలో ఆయన హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. దాదాపు రెండు వేల పాటలు వెన్నల కంటి రాశారు. ‘ఆదిత్య 369’, ‘ఘరానా అల్లుడు’, ‘ఘరానా బుల్లోడు’, ‘క్రిమినల్’, ‘శ్రీ కష్ణార్జున విజయం’, ‘సమరసింహారెడ్డి’, ‘శీను’ వంటి చిత్రాల్లో మంచి పాటలు రాశారు. ఆయన చివరిగా ‘పెంగ్విన్’ సినిమాకు పనిచేశారు. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడం ద్వారా వెన్నెలకంటి ప్రసిద్ధి పొందారు. పాటలు రాయడంతో పాటు పలు డబ్బింగ్ సినిమాలకు మాటలు, స్క్రిప్ట్ రైటర్‌గా కూడా వెన్నెలకంటి సేవలందించారు. వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు.’శ్రీరామచంద్రుడు’ సినిమాతో గీత రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. 1979లో చంద్రగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న సమయంలో సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో వెన్నెలకంటి సినీరంగంలో అడుగుపెట్టారు. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ గేయ రచయితగా స్థిరపడ్డారు.