ఏపీలో ఆలయాలకు రక్షణ కరువు

 

రాష్ట్రంలోని ఆలయాల్లో ఉండే విగ్రహాలకు రక్షణ కొరవడిందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామి అన్నారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థం ఘటనలే ఇందుకు ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 50కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని.. మంగళవారం సింగరాయకొండలో మరో ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసినట్లు తెలిసిందన్నారు. ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత దేవాదాయ శాఖకు ఉందని.. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చినజీయర్‌ స్వామి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం ప్రజలకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఆలయాల వద్ద రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దేవాలయల ఘటనపై ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరిపించాలని.. ఎవరు తప్పు చేసినా నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా కమిటీ ఉండాలని ఆయన కోరారు. 17 వ తేదీ నుంచి దాడులకు గురైన ఆలయాలను సందర్శించనున్నట్లు చినజీయర్‌ స్వామి ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *