విగ్రహాలను ధ్వంసం చేసింది హిందువులే !

ఈ మత రాజకీయాలు చేసేవాడు కూడా ఒక హిందువే. నేను ఖచ్చితంగా చెప్తున్నా.. ఇది వైసీపీ వాళ్లు చేసేది కాదు.. ఆయన్ని దిగజార్చడానికే ఇలాంటివి చేస్తున్నారని వివాదస్పద నటి శ్రీరెడ్డి వెల్లడించారు. హాట్ టాపిక్‌గా మారిన విగ్రహాల ధ్వసం ఇష్యూపై ఫేస్ బుక్ లైవ్ నిర్వహించిన శ్రీరెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని బ్యాడ్ చేసేందుకు కొంతమంది ఇలాంటి నీఛరాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఫేస్ బుక్‌లో లైవ్‌లో శివాలెత్తింది శ్రీరెడ్డి. ఆమె మాట్లాడుతూ.. హిందువులే ఇది చేస్తున్నారు. రాజకీయంగా జగన్‌ని ఎదుర్కొనలేక హిందువులుగా ఉండి నాటకాలు ఆడుతున్నారు. ఇది క్రిస్టియన్, ముస్లింలపై రుద్దుతున్నారు. జగన్ ఒక క్రిస్టియన్ అని ఆయన్ని నేను రెస్పెక్ట్ చేయడం లేదు.. మనిషికి రెస్పెక్ట్ ఇస్తా. నేను ప్రతి మతానికి రెస్పెక్ట్ ఇస్తా. ఇది పొలిటికల్ డ్రామా. వాళ్ల దగ్గర అన్ని అస్త్రాలు అయిపోతే ఇప్పుడు మతాలని తెరపైకి తీసుకువచ్చారు. ఒక పొలిటికల్ లీడర్ని నాశనం చేయాలంటే హిందువుల్ని రెచ్చగొట్టాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే జగన్ క్రిస్టియన్ కాబట్టి. కాస్తైనా బుర్ర ఉందా..? మనిషి పుట్టుకే పుట్టారా?? ఇలాంటి పిచ్చపనులు చేస్తారా?? ఇంత ఏజ్ వచ్చిన తరువాత కూడా రాజకీయాల్లో ఇలాంటి పెంట పనులు చేయిస్తారా? మీరూ మీరూ కొట్టుకుని చావండి. దేవుళ్లును ఎందుకు తీసుకువస్తున్నారు అని మండిపడింది శ్రీరెడ్డి.