జగన్‌కు ఎందుకంత భయం

రామతీర్థం సందర్శనకు వెళ్తే సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత భయమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సష్టించినా రామతీర్థం చేరుకోని నిరసన తెలిపామని చెప్పారు. నిరసన తెలిపే హక్కును సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం హరించి వేస్తోందని పవన్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం దోషులను పట్టుకోని కఠినంగా శిక్షించాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.