వృద్దురాలిపై గ్యాంగ్ రేప్

ఎన్ని కొత్త చట్టాలు వస్తున్న, కఠిన శిక్షలు పడుతున్న కామాంధులు మాత్రం మారడం లేదు. వయసు తారతమ్యాలు భేదం లేకుండా మృగాళ్ల మహిళలపై దాడులు చేస్తున్నారు. దేశంలో గ్యాంగ్ రేప్‌ల సంఖ్య తగ్గడం లేదు. దేశంలో జార్కండ్లో మరో దారుణ మానభంగం సంఘటన చోటు చేసుకుంది. మరో దారణం చోటు చేసుకుంది. చత్రా జిల్లాలోని కోబ్నా గ్రామంలో 50 ఏళ్ల ఓ వితంతువుపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హంటర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. వితంతువు ఒంటరిగా.. పోలీసుల కథనం ప్రకారం… కోబ్నా గ్రామానికి చెందిన ఓ వితంతువు ఒంటరిగా జీవిస్తోంది. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెపై కన్నేశారు. గురువారం (జనవరి 7) రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డ ఆ ముగ్గురు.. ఆమెపై సామూహిక అత్యాచారా నికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి చిత్రహింసలకు గురిచేశారు. దీంతో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం హంటర్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ డా.వెంకట్ ప్రకాశ్ తెలిపారు. మహిళలకు రక్షణ లేకుండా .. ఈ ఘటనకు సంబంధించి మ్నుగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా… అతని కోసం ప్రత్యేక బందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.