ఇప్పుడే ఆలయాలపై దాడులు ఎందుకు ?

 

కావాలనే దాడులు చేస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. జన సంచారం లేని ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడే ఎందుకు జరిగాయో అర్థం చేసుకోవాలన్నారు. నిజా నిజాలు త్వరలో తెలుస్తాయని చెప్పారు. కానీ తప్పుచేసిన వారిని వదలబోమని స్పష్టంచేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా ఒకటే అనే భావనతో మత సామరస్య కమిటీలు వేశామని మంత్రి బొత్స సత్య నారాయణ స్పష్టం చేశారు. ప్రజల్లో అలజడి సష్టించడానికి సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దుశ్చర్యలకు పాల్పడి అల్లర్లు సష్టిస్తున్నారని.. జరిగే ఘటనలను ప్రభుత్వం నిశీతంగా పరిశీలిస్తుం దని చెప్పారు.కానీ కుట్రపూరితంగా దాడులకు తెగబడటం ఏంటీ అని ప్రశ్నించారు. రామతీర్థం ఘటన సమయంలో సీఎం జగన్‌ విజయనగరం జిల్లా పర్యటన ఉందని గుర్తుచేశారు. ఈ కుట్రలో కొందరు భాగస్వాములు ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు పని చేస్తున్నాయని ఫైరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనం అని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఈ తరహా ఘటనలు జరగలేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *