వైసీపీ చెబుతున్నవి ఫేక్‌ లెక్కలే

 

పంచాయతీ ఎన్నికల్లో 94 శాతం గెలిచామంటూ వైసీపీ చెబుతున్నవి ఫేక్‌ లెక్కలే అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతప్తి వ్యక్తం చేశారు. వైసీపీ పతనానికి ఈ ఫలితాలతో నాంది పడిందన్నారు, ఇది ప్రారంభమని, రాబోయే రోజుల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. 90 శాతానికి పైగా గెలవకపోతే మీ పదవులు పీకేస్తానని జగన్‌ టార్గెట్‌ పెట్టారని, వీటితో హింస చెలరేగిందన్నారు. ఈ ఎన్నికల్లో మద్యం, కండబలంతో పాటు అన్నీ ఉపయోగించారని, ఇన్ని చేసినా ప్రజలు నిలబెడ్డారని చంద్రబాబు ప్రశంసించారు. వారే నిజమైన హీరోలు అన్నారు. టీడీపీ నేతలు ముందుండి ఎన్నికల్లో ఎన్ని దాడులు చేసినా ప్రాణాలు సైతం అడ్డుపెట్టి పోరాడారని చంద్రబాబు తెలిపారు. తాజాగా జరిగిన తొలిదశ ఎన్నికల ఫలితాల్లో 38 శాతం టీడీపీకి అనుకూలంగా వచ్చిందని చంద్రబాబు తెలిపారు. వాస్తవ పరిస్ధితి ఇలా ఉంటే 94 శాతం వైసీపీ గెల్చుకుందని మంత్రులు ఫేక్‌ లెక్కలు చెప్పుకుంటు న్నారని చంద్రబాబు విమర్శించారు. అవన్నీ గాలి కబుర్లే అన్నారు. వైసీపీ ఫలితాలతో కూడా మైండ్‌గేమ్‌ ఆడుతోందని చంద్రబాబు ఆరోపించారు. 95 శాతం గెల్చుకున్నారా అని మంత్రి బొత్సను ఆయన ప్రశ్నించారు. టీడీపీ పని అయిపోలేదని, మీ పతనానికి నాందిపడిందని వైసీపీ సర్కారును ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినా, బెదిరింపులకు దిగినా, పోలీసులను వాడుకుని అరాచకాలు చేసిన జనం టీడీపీ వెనుక నిలబడ్డారని చంద్రబాబు తెలిపారు. మంత్రులు, ప్రభుత్వం, పోలీసులు ఈ ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలపై కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైసీపీ ఓటమికి ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటే నిదర్శనం అన్నారు. ఏపీలో తాజాగా వెలువడుతున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *