సోషల్‌ మీడియాకు కళ్లెం

 

ఓటిటి, సోషల్‌ మీడియాకు కళ్లెం వేసిన కేంద్రం మూడు అంచెల నియంత్రణ విధానాన్ని అమలు చేయ నున్నామని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 25న విడుదల చేసిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (మధ్యవర్తుల మార్గదర్శకాలు మరియు డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌) 2021 నిబంధనల ప్రకారం, ప్రభుత్వం లేదా చట్టపరమైన ఉత్తర్వుల తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొలగించాలి. 36 గంటలవరకు వేచి ఉండకూడదు. ఈ కంపెనీలు అధికారుల నుండి అభ్యర్థించిన 72 గంటలలోపు దర్యాప్తునకు సమాచారం, సహాయం అందించాలి. వెబ్‌సిరీస్‌లలో క్రియేటివిటీ పేరిట హద్దులు మీరిన శ ంగారం చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.కేంద్ర ఐటి మంత్రిత్వశాఖ తాజా ఆదేశాల ప్రకారం ఆయా సంస్థలు భారత్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అలాగే చట్టాలు అమలుకు, ఉల్లంఘనపై చర్యలకు సంబంధిత అధికారులను నియమించుకోవాలి. ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు 24/7 గంటలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలి. ట్విట్టర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి ఇంటర్నెట్‌ మీడియా, సోషల్‌ మీడియాలో వస్తోన్న కంటెంట్‌ను నియంత్రించే వ్యూహంలో భాగంగా కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సంబంధిత చట్టాన్ని సవరించడం ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫాంలపై నియంత్రణకు కేంద్రం తాజా సంస్కర ణలను గురువారం ప్రకటించింది. అభ్యంతరకరమైనమారీంగ్‌ పోస్టులను తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే పాటించాలి. లేదంటే ఆయా సదరు సంస్థలకు నోటీసులు ఇవ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *