కష్టాల్లో ఇంగ్లీషు జట్టు

ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో భారత బౌలర్లు విజ ంభిస్తున్నారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ తన స్పిన్ మాయలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో అదరగొట్టిన అక్షర్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా తొలి బంతికి, మూడో బంతికి వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను భారీ దెబ్బ కొట్టాడు. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 112 పరుగులకే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే రెండు వికెట్ల తీశారు. త టిలో హ్యాట్సిక్ మిస్ చేసుకున్నా..తొలి మూడు బంతుల్లో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.