శీతాకాలం పోతే పెట్రోల్‌ ధరలు దిగి వస్తాయి

 

చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ముడి చమురును సరఫరా చేసే దేశాలు తమ స్వలాభం కోసం ధరలను పెంచుతున్నాయని తెలిపారు. ఫలితంగా వీటి ప్రభావం చమురు ఆధారిత దేశంలోని వినియోగదారులపై పడుతోందన్నారు. ఇదే అంశంపై ఆయా దేశాలతో చర్చించినట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ‘అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. శీతాకాలం పోతే పెట్రోల్‌ ధరలు దిగి వస్తాయి. అయినా, ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ సీజన్‌ గడిస్తే ధరలు తగ్గుతాయి” అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రం చమురు ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్రం విధించే పన్నులు అధికంగా ఉంటున్నాయని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *