హిందీలో విలన్‌గా తెలుగు టాప్‌ హీరో

 

టాలీవుడ్‌ హీరో నాగార్జున ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ అక్కినేని నాగార్జునకి మళ్ళీ హిందీలో వరుస ఆఫర్స్‌ వస్తున్నాయట. తాజాగా స్టార్‌ హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ చేయబోతున్న ఓ మూవీలో నాగ్‌కి కాస్త నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న ఓ రోల్‌ ఆఫర్‌ వచ్చిందట. నెగిటివ్‌ షేడ్స్‌ అయినప్పటికీ హీరోకి థీటుగా ఉండే ఆ క్యారెక్టర్‌.. ‘ధూమ్‌’ సినిమాలో హతిక్‌ రోషన్‌ పాత్ర మాదిరి ఉంటుందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే నాగార్జున మాత్రం ప్రస్తుతానికి ఆ ఆఫర్‌ని కాదనకుండా, చేస్తానని చెప్పకండా మధ్యలోనే ఉంచారట. హోల్డ్‌లో పెట్టారట. గతంలో నాగ్‌ మాట్లాడుతూ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అయినప్పటికీ హీరోకి ధీటుగా ఉండే రోల్‌ అయితే నటించడానికి అభ్యంతరం లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *