వైఎస్‌ కుటుంబంలో ఆస్తి తగాదాలు

 

ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయని మాజీ కాంగ్రెస్‌ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అనుచరడు గోనె ప్రకాషరావు తెలిపారు. తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీపై ఆయన స్పందించారు. వైఎస్‌ కుటుంబంలో కలహాలతోనే షర్మిల పార్టీ పెడుతున్నారని అన్నారు. షర్మిలకు జగన్‌ లోక్‌సభ సీటు, రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నారు. వైఎస్‌ విజయలక్ష్మి ఆశీర్వాదం షర్మిలకు ఉందని వ్యాఖ్యానించారు. అందుకే అందరికీ విజయమ్మ ఫోన్‌ చేస్తున్నారని, తెలంగాణలో పార్టీ పెట్టి రాజశేఖర్‌ రెడ్డి ప్రతిష్టను దిగదార్చుకోవొద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి పార్టీ వల్ల అమాయకులు బలైయ్యారని, చాలా మంది భూములు అమ్మి.. స్వరం కోల్పోయారన్నారు. ఇప్పుడు షర్మిల పార్టీ కూడా అదే తరహాలో నడుస్తోందన్నారు. ఇలా పార్టీలు పెట్టి ఇతరులను ముంచొద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *