మమతాబెనర్జీపై దాడే జరగలేదా ?

 

నందిగ్రాంలో మమతా బెనర్జీ ప్రచారంలో కొందరు కావాలనే తన కారును అడ్డుకున్నారని.. ఐదుగురు దాడి చేశారని మమత ఆరోపించారు. కాగా ఆ సమయంలో సీఎం ఆమె ఎవరో నెట్టివేయడం వల్ల పడిపోలేదని.. తనంతట తానే అనుకోకుండా పడిపోయారని తెలిపారు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి సుమన్‌ తెలిపారు. . కారు డోర్‌ తగిలి పడ్డారే తప్ప.. మరొకటి కాదని చెప్పారు. ఆ సమయంలో కారు మెల్లగా వెళుతుందని వివరించారు. మరో ప్రత్యక్ష సాక్షి చిత్రరంజన్‌ దాస్‌ ప్రకారం.. మమతా కారు నుంచి దిగే సమయంలో అక్కడున్న హోర్డింగ్‌ పడిపోయిందని చెప్పారు. దీంతో మమతా మెడ, మోకాలికి గాయం అయ్యిందని వివరించారు. ప్రచారం కోసం వచ్చిన సమయంలో నాలుగు, ఐదు మంది కలిసి తనపై దాడి చేశారని మమత ఆరోపించారు. అయితే ఆ సమయంలో తన కాలకి గాయమైందని కూడా చెప్పారు. బుధవారం సాయంత్రం 6.15 గంటలకు రెయపర వద్ద గల బిరులియాలో గల ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది. తాను కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు బయటకు తీసేందుకు ట్రై చేశారని.. పెనుగులాటలో పడిపోయానని చెప్పారు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షుల వంతు వచ్చింది. ఏం జరిగిందో వారు చెప్పడంతో దీదీ చెప్పింది అబద్దమా అనే సందేహం కలుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *