జమున బయోపిక్‌లో హాట్‌ బ్యూటీ

 

2018లో సావిత్రి లైఫ్‌ స్టోరీతో మహానటి అనే సినిమా బయోపిక్‌ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. అలాగే ఆ మధ్య సీనియర్‌ నందమూరి తారకరామారావు బయోపిక్‌ కూడా రెండు భాగాలుగా తెరకెక్కింది. బాలకష్ణ హీరోగా తెరకెక్కిన కథానాయకుడు మహానాయకుడు సినిమాలు బాక్సఫీస్‌ వద్ద బోల్తాకొట్టాయి. ఇప్పుడు సావిత్రి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన జమున జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్‌ రూపొందించే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్‌ నర్రా శివనాగు. ఇప్పటికే జమున బయోపిక్‌ సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ చేస్తున్నాడట. జమున లైఫ్‌ స్టోరీకి సంబంధించి ఆమెనే స్వయంగా విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడట. అయితే జమున చక్కటి నటనతో పాటు మంచి డాన్సర్‌ అనే విషయం తెలిసిందే. ఆ పాత్రకోసం డైరెక్టర్‌ మిల్కీబ్యూటీ తమన్నాను పరిశీలిస్తున్నట్లు టాక్‌. ఎందుకంటే ఇప్పటికే తమన్నా తనలోని యాక్టింగ్‌ డాన్సింగ్‌ స్కిల్స్‌ ప్రూవ్‌ చేసుకుంది. కాగా ప్రస్తుతం గోపిచంద్‌తో సిటీమార్‌, వెంకటేష్‌ సరసన ఎఫ్‌ 32లో నటిస్తోంది తమన్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *