విలక్షణ నటుడికి కరోనా

మరో బాలీవుడ్ సెలబ్రిటీ, విలక్షణ నటుడిగా పేరున్న మనోజ్ బాజ్‌పాయ్ కూడా కరోనాకి గురవడంతో మరోసారి సినీ పరిశ్రమపై కరోనా తన పంజా విసురుతుందా ? అనేలా చర్చలు మొదలయ్యాయి. ఈమధ్యే ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్‌కపూర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే ఇటు టాలీవుడ్లో కూడా, చరణ్, వరుణ్ తేజ్, తమన్నా, రకుల్‌ప్రీత్, రాజమౌళి, కీరవాణి లాంటి వారు కరోనా బారిన పడి కోలుకున్నారు.