బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ ఏ ముఖం పెట్టుకొని తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేస్తుంది” అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ”రాష్ట్రానికి ఏం చేసిందని ప్రజలను ఓట్లడుగుతారు. ఒక విధానం లేకుండా డబ్బే ప్రాతిపదికగా కోట్లు ఖర్చు పెట్టి వైసీపీ, టీడీపీలు తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పరస్పరం దూషించుకుంటూ బీజేపీపై ఈగను వాలనివ్వడం లేదు. ”రాష్ట్ర విభజనలోను, విభజన చట్టం అమలులోను, విడిపోయిన రాష్ట్రానికి నిధుల మంజూరులోను తీరని అన్యాయం చేయడం బీజేపీ అదే పంథా అని మండిపడ్డారు