ఎగ్‌ వెజిటబుల్‌ ఆమ్లెట్‌

 

 

 

కావలసిన పదార్థములు : గుడ్లు : 1 లేదా 2, శనగపిండి : 8 టేబుల్‌ స్పూన్స్‌, వరిపిండి : 1 టేబుల్‌ స్పూన్‌, ఉల్లిపాయ : 1, పచ్చిమిర్చి : 2, టమోటాలు : 2, కొత్తిమీర : సగంకట్ట, ఉప్పు : తగినంత, జీలకర్ర : చిటికెడు, వెన్న లేదా నెయ్యి : తగినంత, మజ్జిగ : 4 స్పూన్లు, వంటసోడా : చిటికెడు

తయారు చేయు విధానం ; శెనగపిండి, వరిపిండి, సోడా ఉప్పులను బాగా కలపాలి. దానిలో మజ్జిగ, కొద్దిగ నీరుసోసి దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమోటాలను సన్నగా తరిగి జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. దోశల పెనంగానీ, నాన్‌స్టిక్‌ పాన్‌ గానీ తీసుకొని దానిపై వెన్న గాని, నెయ్యి గాని వేసి కాగిన తర్వాత పిండి మిశ్రమాన్ని దోశలా పోసి, దానిపై తరిగిన కూర ముక్కల్ని సమంగా చల్లాలి.  ఈఆమ్లెట్‌పైన వెన్న చిలకరించి కొద్ది నిమిషాలుంచి తిరగేయాలి. రెండో పక్క కూడా కాలిన తరువాత వెజిటబుల్‌ ఆమ్లెట్‌ తినడానికి సిద్ధమయినట్టే. ఈ ఆమ్లెట్‌ని వేడివేడిగా తింటే దాని రుచే వేరు మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *