ఇంటి అద్దె నెలకు రూ. 2 కోట్లు

 

 

రెండు కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో టక్కున చెప్పమంటే మనలో చాలామంది తడబడతారు. అలాంటి రెండు కోట్లు మీ దగ్గరే ఉంటే మిమ్మల్ని సమాజం గొప్పగా చూస్తుంది. జీవితంలో మనం రెండు కోట్ల రూపాయిలు సంపాదిస్తామో లేదో కాని ఓ పెద్దాయన మాత్రం కేవలం ఇంటి అద్దె ద్వారా ప్రతినెలా రెండు కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ అంత అద్దె చెల్లించబోతున్న వ్యక్తి మనోడే .. మన ఇండియాకి చెందిన కొవిషీల్డ్‌ (ఆక్స్‌ఫర్డ్‌) టీకా తయారీసంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా. వివరాల్లోకి వెళితే అదర్‌ పూనావాలా లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం మేఫెయిర్‌లో ఓ విలాసవంతమైన భవంతిని ఇటీవల లీజుకు తీసుకున్నారు. ప్రతివారం 50 వేల పౌండ్ల (రూ.అర కోటి)ని అద్దెగా చెల్లిస్తానని ఆ ఇంటి యజమాని, ప్రముఖ బిలియనీర్‌ డొమినికా కల్క్‌జిక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ భవనం అత్యంత విశాలంగా 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ప్రాంగణంలోనే ఒక అతిథిగహంతో పాటు కనువిందు చేసే ఉద్యానవనాలు ఉన్నాయి. మరి అదే డబ్బుంటే స్వర్గమే భువికి దిగిరాదా అని కవులు చెబుతు వుంటారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *