కోహ్లి మరో రికార్డు

 

పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో 66 పరుగుల వద్ద టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అవుటయ్యాడు. ఈ క్రమంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి 10046 పరుగులు పూర్తిచేసుకున్నాడు. కాగా పాంటింగ్‌(12662), కోహ్లి (10046) తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార్‌ సంగక్కర (9,747- 238 ఇన్నింగ్స్‌), దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వస్‌ కలిస్‌ (7,774) తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(5421) ఒక్కడే ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో రికార్డు కూడా నెలకొల్పాడు. 50- ఓవర్ల క్రికెట్‌లో, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ (5416) పేరిట ఉన్న రికార్డును అధిగమించి, అత్యధిక పరుగులు చేసిన ఐదో కెప్టెన్‌గా కూడా నిలిచాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ దిగి 10 వేలకు పైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *