రామ్‌చరణ్‌ ‘రామరాజు’ పోస్టర్‌ విడుదల

 

రేపు(మార్చి27)న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చేసింది రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్ర బందం. ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి సీతారామరాజు ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. విల్లు పట్టుకొని బాణం వదులుతున్నరామరాజు పోస్టర్‌ను విడుదల చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్రలో కనిపిస్తుండగా, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా సీతగా ఆలియా భట్‌ నటిస్తుంది. ఈ మూవీని అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *