వృద్ధుడి కడుపులో 59 అడుగుల వర్మ్‌ పురుగు

 

థాయ్‌ లాండ్‌లో చోటు చేసుకున్న ఈ అరుదైన సంఘటన చూసి వైద్యులే షాక్‌కు గురయ్యారు. కడుప ునొప్పితో బాధపడుతూ నాంగ్‌ ఖాయ్‌ ప్రావిన్స్లోని ఓ ఆస్పత్రిలో చేరారు 67 ఏళ్ల వద్దుడు. తాను ఆపానవాయువు అనే సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్లకు చెప్పారు. పరీక్షల అనంతరం అతడు టేప్‌ వర్మ్‌ (ఆంత్రపరాన్న పురుగు) సమస్యతో బాధపడుతున్నాడని.. అతని కడుపులో ఆ పురుగు 28 గుడ్లను వైద్యులు గుర్తించారు. తర్వాత నులిపురుగును నిర్మూలించే మాత్రలను ఇవ్వగా అది టేప్‌ వర్మ్‌ పై ప్రభావం చూపింది. అతడి మలద్వారం గుండా ఆ పురుగు బయటకు వచ్చింది. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టిందని.. చిన్న చిన్న ముక్కలుగా చివరకు మొత్తంగా 18 మీటర్లు బయటకు తీశారు. ఈ విషయాన్ని ఆ ఆస్పత్రిలోని పారాసైటిక్‌ డిసీజ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సిబ్బంది వెల్లడించారు. ముక్కలుముక్కులుగా బయటకు తీసిన ఆ పురుగు ఏకంగా 59 అడుగులున్నట్లు తేలిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *