వేల కోట్ల రూపాయిు ఎగవేసిన టీడీపీ మాజీ ఎంపీ

 

బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను దారి మళ్ళించటానికి కంపెనీ డైరెక్టర్లు ఉద్యోగుల పేర్లతో అనేక రకాల కంపెనీలు పెట్టారు పార్లమెంటు మాజీ సభ్యుడు రాయపాటి సాంబశివరావు. చివరకు వాళ్ళకు కూడా తెలీకుండానే వాళ్ళపేర్లతో వాటాలు జారీచేయటం వేరే బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి నిధును జమచేయటం లాంటివి అనేకం జరిగినట్లు ఈడీ గుర్తించింది. చివరకు తమ పేర్లతో ఉన్న వాటాను కొనటానికి మళ్ళీ బ్యాంకుల్లో అప్పు తీసుకోవటమే పనిగా రాయపాటి పెట్టుకున్నారట. రాయపాటి సాంబశివరావు వేల కోట్ల రూపాయు ఎగవేసినట్లు ఎన్ఫోర్స్‌ మెంటు డైరెక్టరేట్‌ (ఈడీ) లెక్కలె తేల్చింది. రాయపాటి రకరకాలు పేర్లతో ఎన్ని కంపెనీు పెట్టారో ? ఎన్ని బ్యాంకుల్లో రుణాు తీసుకున్నారో ఎంతమంది పేర్లతో అప్పు తీసుకుని వేల కోట్ల రూపాయు దారిమళ్ళించారనే విషయమై ఈడీ మరింత లోతుగా దర్యాప్తుచేస్తున్నారు. రాయపాటి వేల కోట్ల రూపాయ ఎగవేత అంశం చాలా సంవత్సరాుగా నలుగుతోంది. ఏదో పేరుతో అనేక బ్యాంకుల్లో భారీ ఎత్తున లోన్లు తీసుకోవటం ఇంకేవో కంపెనీలకు తరలించేయటం తర్వాత సదరు కంపెనీలను దివాలా తీసినట్లో లేకపోతే మరేదో కారణంతోనే వాటిని మూసేయటం రాయపాటికి అలవాటుగా మారిందనే ఆరోపణు బలoగా వినిపిస్తున్నాయి. విచిత్రమేమిటంటే తమ పేర్లతో కంపెనీున్నట్లు వాటాలు జారీ అయినట్లు చివరకు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న విషయం కూడా డైరెక్టర్లు ఉద్యోగులకు కూడా తెలీదు. మొత్తంమీద బ్యాంకుల్లో తీసుకున్న అప్పుల్లో ఎగవేసింది రూ. 10115 కోట్లయితే బ్యాంకుల్లో తీసుకున్న అప్పుల్లో దారి మళ్ళించింది రూ. 7153 కోట్లుగా ఈడి లెక్క తేల్చింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *