బహిష్కరణ అంటూనే వారికి బలo ఉన్న చోట్ల డబ్బు పంచుతున్నారు

బహిష్కరణ అంటూనే వారికి బలo ఉన్న చోట్ల డబ్బులు టీడీపీ నాయకులు పంచుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. ఆయన శనివారం తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓజిలి మండంలో నిర్వహించన వైఎస్సార్‌సీపీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. మొదటి నుంచీ చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమే అని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గొస్తామని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు ఆడలేక మద్దె ఓడు అన్నట్లు ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు రావని తెలిసే చంద్రబాబు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక బహిష్కరణ డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. నామినేషన్లు, ఉపసంహరణ అయిపోయి, పోలింగ్‌కు 5 రోజు ఉండగా బహిష్కరణ ఏంటి అని సూటిగా ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *