చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైంది ?

చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైంది అని ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించారు. ఓటమి గ్రహించే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుంటిసాకులు చెప్పడం హాస్యాస్పదం అని మండిపడ్డారు. సీఎం జగన్‌ అద్భుత పాలన ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయని తెలిపారు. ఏ ఎన్నికలు  జరిగినా వైఎస్సార్‌సీపీదే విజయం అని ఎంపీ తలారి రంగయ్య ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చరిత్ర హీనుడు అని ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఎన్నికలను బహిష్కరించలేదని ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *