వివేకా హత్య కేసులో ఇంటి దొంగలెవరో ?

మాజీమంత్రి వివేకా హత్య కేసులో ఇంటి దొంగలెవరో తమ ప్రభుత్వం తేల్చాని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. వివేకా కుమార్తె ఒంటరి పోరాటం చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ విచారణ డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు ? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నిం చారు. సీఐడీ విచారణకు ఆదేశించినా పురోగతి శూన్యమని తప్పుబట్టారు. శవానికి కుట్లు వేసిన ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని రఘురామకృష్ణరాజు చెప్పారు. రాజన్న రాజ్యం కోసం వైఎస్ షర్మి ఏపీలో పోరాడాని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచిం చారు.