ఆంధ్రాలో విజృంభిస్తోన్న కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రక్కసి స్పీడు పెంచింది. ఒక్కరోజు వ్యవధిలో 31,657 నమూనాను పరీక్షించగా 1,941 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. 24 గంట వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ ఏడుగురు మృతిచెందారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. చిత్తూరు, గుంటూరు, కర్నూు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,251కి చేరింది. ఒక్కరోజులో 835 మంది కరోనా నుంచి పూర్తిగా కోుకోగా.. ప్రస్తుతం 11,809 యాక్టివ్‌ కేసున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,70,771 నమూనాను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 424, అత్య్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 25 కేసు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వ్లెడిరచింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసు సంఖ్య 9,10,943కి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *