మళ్లీ పెళ్లి కోవడం లేదు

రియల్‌ లైఫ్‌లో తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని, వైరల్‌ అయిన వెడ్డింగ్‌ కార్డు తన తదుపరి సినిమాకి సంబంధించినది అని అక్కినేని హీరో సుమంత్‌ క్లారిటీ ఇచ్చేశాడు. పళ్లి, విడాకులకు సంబంధించి ఓ సినిమా చేస్తున్నానని, ఆ ఫిల్మ్‌ షూట్‌ నుంచి ఒక పెళ్లి కార్డు ఫోటో లీకైందని చెప్పారు. ఆ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని త్వరలోనే విడుదల చేస్తామని సుమంత్‌ చెప్పాడు. అక్కినేని హీరో సుమంత్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. సుమంత్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతితో ఆయన వివాహం జరగబోతుందని, ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ వదంతులపై హీరో సుమంత్‌ స్పందించాడు. ప్రస్తుతం సుమంత్‌ ‘అనగనగా ఒక రౌడీ’లోచిత్రంలో నటిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *