44 అంటే నమ్మలేకపోతున్నా

sachin
ముంబై: తనకు అప్పుడే 44ఏండ్లు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. సచిన్ సోమవారంతో 44వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పుణెతో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ముందు వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సచిన్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశాడు. స్టేడియంలోని ప్రేక్షకులంతా హ్యాపీ బర్త్‌డే సచిన్ అంటూ పాట రూపంలో వినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 44 అంకె బాగున్నా, నాకు అప్పుడే అంత వయసు వచ్చిందంటే నమ్మబుద్ది కావడం లేదు.

ఇన్నేండ్లు బిజీగా గడుపుతూ ఈ విషయాన్నే గమనించలేదు అని సచిన్ అన్నాడు. అంతకుముందు సచిన్ కుటుంబసభ్యుల మధ్య ముంబైలోని తన స్వగృహంలో వేడుకలు జరుపుకున్నాడు. మాస్టర్‌కు టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లీ, అశ్విన్, హర్భజన్, గంభీర్, సెహ్వాగ్, కుంబ్లే, క్లార్క్, కైఫ్, గిల్‌క్రిస్ట్ బర్త్‌డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్‌డే పాజీ. జీవితంలో మరింత సుఖసంతోషాలు కలుగజేయాలని ఆ దేవుణ్ని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడు నువ్వే నా క్రికెట్ హీరో అంటూ విరాట్ ట్వీట్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *