అంచనాల మేరకు గనుల శాఖ ఆదాయం
- 74 Views
- wadminw
- October 26, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): తెలంగాణ గనుల శాఖ ఆదాయ రాబడలిలో దూసుకపోతున్నది. నిర్దేశిత బడ్జెట్ లక్ష్యాలను మించి రాష్ట్ర ఖజానాకు సినరేజి ఫీజు వసూలు ద్వారా ఆదాయాన్ని గనుల శాఖ సమకూర్చుతున్నది. రికార్డు స్థాయిలో ఇసుక మినహా మిగిలిన ఇతర మైనర్ మినరల్స్ ద్వార వచ్చే ఆదాయంలో 69 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇక ఇసుక నుండి వచ్చే ఆదాయంలోనూ ఇదే రీతిన ఆదాయాభివృద్ధిని నమోదు చేస్తూ వస్తున్నది. సరిగ్గా ఆర్థిక సంవత్సరానికి రెండు త్రైమాసికాల్లో ఇసుక ఆదాయంలోనూ 57 శాతం వృద్ధి నమోదు చేసింది. బుధవారం సచివాలయంలో మంత్రి గుల శాఖ మీద సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, సెప్టెంబర్ రెండు త్రైమాసికాల్లో మైనర్ మినరల్స్ ద్వారా 357.41 గత ఏడాది ఇదే కాలానికి 211.4 కోట్లు ఇసుక సినరేజీ ఫీజులోనూ 183.7 కోట్లు గద ఏడాది ఇదే కాలానికి 117.14 ఆదాయం సమకూరిందన్నారు. గనుల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న సందర్భంగా పనితీరు ఆధారంగా ప్రోత్సహకాలిస్తామని చెప్పామని, అందుకే ఇప్పుడు నిర్దశిత లక్ష్యాలను పూర్తి చేసిన వారిందరికి ప్రొత్సహకాలిచ్చేందుకు వెంటనే మార్గ దర్శకాలు రూపొందించాలని గనుల శాఖ ముక్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఇన్ సెంటివ్ మాడల్ తయారు చేయాలన్నారు. ఈ ప్రోత్సహకాల ద్వారా ఉద్యోగుల్లో ఉత్సహంతోపాటు, పని చేస్తే గుర్తింపు లభిస్తుందన్న ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. పారదక్శకమైన, ప్రొత్సహపూరిత వర్క్ కల్చర్ పెంచాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి తెలిపారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో కలెక్టర్లందరికీతో గనుల శాఖ, ఇసుక సరఫరాలపై త్వరలోనే ఒక వీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పనులకు, ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన రాయాల్టీ బకాయిలపై సింగరేణి సియండి శ్రీధర్‌తో మంత్రి మాట్లాడారు. గత ఏడాది చవరి త్రైమాసికానికి, ఈ ఏడాది రెండు త్రైమాసికానికి కలిపి రావాల్సిన సుమారు 1000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ బకాయిలను చెల్లిస్తామని మంత్రికి శ్రీధర్ తెలిపారు.
ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పని చేయాలి: మంత్రి జూపల్లి
హైదరాబాద్, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరడమే లక్ష్యంగా జిల్లాల విభజనను సీఎం కేసీఆర్ చేపట్టారని, ఇందుకోసం ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జిల్లా విభజన తర్వాత డ్వామా, డీఆర్డీఏలను ఏకం చేస్తూ జిల్లా రూరల్ డెవలప్మెంట్ అధికారుల వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆ రెండు శాఖలపై డీఆర్డీఓలకు అవగాహన కల్పించేందుకు రాజేంద్రనర్లోని టీ-సీపార్డ్లో మూడు రోజుల శిక్షణ తరగతులను మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతుకుమార్ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్వాతంత్య్రిం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్న గ్రామాలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడంలేదన్నారు. గ్రామాల స్వయం సమృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తారని, ఇందులో భాగంగానే దేశానికి ఆదర్శకంగా తెలంగాణకు నిలిపేలా జిల్లా విభజనకు శ్రీకారం చుట్టారన్నారు. సీఎం కేసీఆర్ ఆశయం, ప్రభుత్వ లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా అందరికి భాగస్వామంతో ముందుకు పోవాలని డీఆర్డీఓలను మంత్రి సూచించారు. ప్రజల సేవ చేయాలనే తపన. చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిది ఏది లేదన్నారు. కొత్త రాష్ట్రంలో నూతన ఒరవడి, కొంగొత్తకార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఉద్యోగులు కూడా కార్యనిర్వణలో కొత్తదనం చూపాలన్నారు. అర్హులందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములై పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సాధనలో కలిపి కట్టుగా పని చేసినట్టుగానే రాష్ట్ర అభివృద్ధిలోను భాగస్వామ్యం కావాలని కోరారు. ఇప్పటికే విద్యుత్ సరఫరా, నూతన పారిశ్రామిక విధానం, మిషన్ కాకతీయ, మిషనర్ భగీరథ ద్వారా దేశానికే రాష్ట్రం ఆదర్శంగా మారిందన్నాఉ. ఇదే తరహాలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఆదర్శంగా నిలవాలని, చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయంతం చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. కాగా, గత కొన్నేళ్లుగా మహిళా సంఘాలు నిర్విర్యమై పోయాయని, మహిళా సంఘాలను సంఘటితశక్తిగా రూపొందించేందేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి అన్నారు. ఆర్థిక పరిపుష్టితోపాటు మహిళల శక్తి,ఇ సామర్ధ్యాలను వెలికి తీసేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోను మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. మహిళా సంఘాలు క్రియశీలకంగా పని చేసిన చోటే హరితహారంలో మెరుగైన ఫలితాలు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.


