‘అండర్ కవర్’ పాలనలో పాక్?
- 105 Views
- wadminw
- September 3, 2016
- అంతర్జాతీయం
ఆ దేశం వాళ్లకు మహా అయితే సైకిళ్లు, సూదులు చేయడం తప్ప మరేమీ రాదని అంతా అనుకుంటారు. కానీ, కొన్నాళ్లకు ఏకంగా అణుబాంబులు, ఖండాంతర క్షిపణులు కూడా తయారుచేసి చూపించింది. అంత పరిజ్ఞానం ఎలా వచ్చిందా? అని విశ్వం అంతా షాక్ అయింది. ఆ దేశ అణు పితామహుడు “ఏక్యూ ఖాన్” అసలు స్వరూపం గుట్టు అప్పుడు విప్పాడు. విషయం చెప్పేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని చోరీ చేయడం, కావల్సిన సామగ్రిని స్మగ్లింగ్ చేయడం ద్వారానే తాము అణుబాబులు చేశామన్నారు. ప్రయోగాల ఖర్చులేదు, కృషిలేదు, కష్టం లేదు ఒక్క చేతివాటం తప్ప. అప్పటి నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్ పద్దతి, స్వభావం, తీరు మాత్రం మారలేదు.
ఇప్పుడు తాజాగా ఆ దేశం డ్రోన్లు (యు.ఏ.వి. -అన్మాండ్ ఏరియల్ వెహికిల్స్) తయారు చేయాలని అనుకుంటోంది. కానీ, ఎలా చేయాలో? ఏవిధంగా చేయాలో? తెలియదు. తెలిసిందల్లా దొంగతనం చేయటం మాత్రమే. అందుకే అమెరికా నుంచి ఆ పరిజ్ఞానాన్ని చోరీ చేయడానికి ఓ పాక్ వ్యాపారవేత్త ప్రయత్నించాడు. అక్రమంగా జైరోస్కోప్స్ సేకరించడానికి ప్రయత్నిస్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. సయ్యద్ వఖార్ అష్రఫ్ అనే వ్యక్తి లాహోర్‌లో ఐ అండ్ ఈ ఇంటర్నేషనల్ అనే సంస్థకు సీఈవో. ఇన్నోవేటివ్ లింక్స్ అనే బూటకపు కంపెనీ పేరుతో జైరోస్కోపులు కొనటానికి ప్రయత్నించాడు. అందుకోసం వఖార్ ఎ జాఫ్రీ అనే దొంగ పేరుతో రోస్కోపుల ధరలకు కొటేషన్ ఇవ్వాలని టస్కన్కు చెందిన ఓ కంపెనీని అడిగాడు.
అయితే దీనిపై అమెరికా ప్రభుత్వం నియంత్రణలు ఉన్నాయని, అమ్మాలన్నా, కొనాలన్నా లైసెన్సు కావాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించకోలేదు. చివరకు 18 జైరోస్కోపుల కోసం తప్పుడు పత్రాలు సృష్టించాడు. చివరకు అండర్ కవర్ ఏజెంట్లకు దొరికేశాడు. అంతేకాదు తన క్లైంట్స్ పాక్ మిలిటరీ అని వారికి తెలిపాడు కూడా. ఇదంతా ఆ టస్కన్ కంపని హోంలాండ్ సెక్యూరిటి ద్వారా షీల్డ్ అమెరికా (ఎఫ్.బి.ఐకి – రక్షణ రంగ చెందిన సాంకేతిక విభాగం) ద్వారా వివరాలను అందించింది. తాను పాకిస్థాన్ ప్రభుత్వం & మిలటరీ కోసమే వీటిని కొంటున్నట్లు చెప్పాడు. పాశ్చాత్యదేశాల నుంచి ఇంతకుముందు లైసెన్సు లేకుండానే తమ దేశం అణు పరిజ్ఞానం కూడా తెచ్చుకుందని అతడు చెప్పాడు.
జీవ రసాయన ఆయుధాలలో ఉపయోగించే రిసీవర్ మాడ్యూళ్లు కూడా తమకు కావాలని తెలిపాడట. అతడు చెప్పిన వివరాలు విని విస్తుపోయిన అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు చివరకు అతడిని కోర్టుకు అప్పగించగా, ప్రస్తుతానికి అతడికి 33 నెలల జైలుశిక్ష విధించారు. మరోవైపు, ఐసిస్‌కు మద్దతు తెలిపే వారు ఎక్కువైపోయారా? ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సింది పోయి మతం పేరుతో ప్రోత్సహిస్తున్నారెందుకు ఉగ్రవాదుల జాడల వెనక ఉన్న నీడలు ఎవరివి? విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్లే ఉగ్రవాద నీడలకు అండగా నిలబడుతున్నారా? రాజ్యాంగాన్నీ వక్రీకరించి మరీ బోధనలు చేయాల్సిన అవసరం ఏముంది? టెర్రరిజానికి నక్సలిజం కూడా తోడైందనే వార్తల్లో వాస్తవమెంత?
టెర్రరిస్టులు లక్ష్యాన్ని చేధించేందుకు ఏం చేసేందుకైనా వెనకడాటం లేదు. నెట్‌వర్క్‌ను పెంచుకోవడం కోసం వారు పన్ని వ్యూహం ఏంటనేది తెలుసుకుంటే ఎవరైనా సరే షాక్‌కు గురికావాల్సిందే. ప్రజా హక్కులపై పోరాడే నక్సలైట్లు సైతం ఇప్పుడు టెర్రరిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారట. ఈ విషయం ఎన్ఐఏ పరిశోధనలో వెల్లడైంది. ఇదే నేపథ్యంలో ఉగ్రవాదులను తరిమికొట్టాల్సింది పోయి టెర్రరిస్ట్‌ల అరెస్ట్‌లను ఖండించే వాళ్లు దారుణ మారణకాండకు పాల్పడుతున్న వారికి న్యాయసాయం అందిస్తానంటూ ముందుకొస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమవుతుంది. మేధావులమని చెప్పుకు తిరిగే ప్రొఫెసర్లు సైతం ఇప్పుడు ఉగ్రవాద సానుభూతి పరులిగా మారిపోతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటుగా ఇప్పుడు నక్సలైట్లు కూడా ఉగ్రవాదులకు అండగా నిలబడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతుంది. దేశాన్ని నాశనం చేయాలనేది ఉగ్రవాదుల టార్గెట్.
హిందువులను సమూలంగా మట్టుబ్టెట్టి పాకిస్థాన్ పతాకాన్ని ఎగురవేయాలనేది వారి సంకల్పం. దీనికి హిందుస్థాన్‌లో జీవించే ఏ ఒక్కరు సహకరించరు. కానీ కొందరు దుర్మార్గులు వీరికి సహకారం అందిస్తున్నారు. భారతీయులమని చెప్పుకుంటూనే పాకిస్థానీ సానుభూతిపరులుగా మారిపోతున్నారు. చివరకు వాళ్లే ఉగ్రవాదులైపోతున్నారు. మారణాయుధాల తయారీని సైతం నేర్చుకుని ఉన్న చోటే బాంబులు, తుపాకులు తయారు చేసేస్తున్నారు. ఇవన్నీ తప్పని చెప్పాల్సిన కొందరు మేధావులు కొత్త వాదనలు వినిపిస్తున్నారు. వాస్తవానికి ఉగ్రవాదులకు మద్దతుగా నిలబడేంత అవసరం నక్సలైట్లకు ఏముంది? వారి పోరాటాలకు ఉగ్రవాదుల అరాచకాలకు సంబంధం ఏముంది?
నక్సల్స్ కూడా తమ రూటు మార్చుకున్నారా? దేశాన్ని నాశనం చేయాలనుకునే ఉగ్రవాదులతో నక్సల్స్‌కు లింకేంటి? ఇలాంటి ప్రశ్నలకు పౌరహక్కుల సంఘాలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థలో శిక్షణ పొంది ఏదో విధంగా భారతదేశంలో అడుగుపెడుతున్న వారికి నక్సలైట్లు అండగా నిలుస్తాన్నరంటే దేశంలో పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతుంది. మతంపేరుతో ఉగ్రవాదానికి వత్తాసు పలుకున్న మేధావులు ఇప్పటికైనా మేలుకోవాలి. ఇండియాను ప్రధానంగా హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్న తీవ్రవాదులకు షెల్టర్ ఇచ్చే మేధావులు ఇప్పుడు సమాధానం చెప్పాలి.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే నక్సలైట్లను సైతం పౌరహక్కుల సంఘాలు ప్రశ్నించాల్సిన అవసరముంది. భారత-పాకిస్థాన్ సంబంధాల్లో మౌలిక సమస్యలు, ఇబ్బందికర సమస్యలు యథాతథంగా కొనసాగుతున్నప్పటికీ శాంతి-స్నేహ వారధులు నిర్మించుకుంటూ వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగాలన్న సంకల్పం ఎప్పటికప్పుడు ఎండమావిగానే మారుతూ వస్తోంది. భారత-పాకిస్థాన్ సంబంధాల సాధారణ క్రమంలో మరో పార్శ్యం, ప్రస్తుత దశలో ప్రాధాన్యం వహిస్తున్న పార్శ్యం వాణిజ్యా భివృద్ధి. భారతదేశానికి ప్రాధాన్యతా దేశం హోదాకల్పించటానికి అంగీకరిస్తూ కొద్దిమాసాల క్రితం పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం వాణిజ్యం పెంపుదలకు దోహదకారి అవుతుందని ఆశిస్తున్న తరుణంలోనే సరిహద్దుల్లో పరిస్థితులు రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచే విధంగా తయారయ్యా.యి.
గత కొద్ది సంవత్సరాలుగా భారత్-పాకిస్థాన్ ప్రధాన మంత్రులు అంతర్జాతీయ వేదికల్లో-ఐరాస, జి.20, సార్క్, ఏసియన్ వగైరా సమావేశాల సందర్భాల్లో కలుసుకున్నారు. ముఖాముఖీ చర్చలు జరిపారు. అయితే టెర్రరిజం పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం తగినంత సీరియస్‌గా వ్యవహరించటంలేదనే అభిప్రాయం భారత ప్రభుత్వంలో వుంది. తాము తగినన్ని సాక్ష్యాధారాలిచ్చినా 26/11 నేరస్థ ముఠాపై చర్య తీసుకోవటం లేదని గత హోంమంత్రి చిదంబరం పలుమార్లు చెప్పటం గుర్తుచేసుకోదగింది. కాగా, పాకిస్థాన్ అంత ర్జాతీయ టెర్రరిజానికి అడ్డాగా మారిందని, దాన్ని అణచివేయాలని అమెరికా సహా ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తున్నా, తామూ టెర్రరిజం బాధితులమేనని పాకిస్థాన్ మొరపెట్టుకుంటోంది.
అది కూడా వాస్తవమే, కానీ స్వయంకృతం. పాకిస్థాన్ సైన్యం, దాని ఐ.ఎస్.ఐ. టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధానాన్ని మార్చుకునే వరకు మనం మార్పును ఆశించలేము. సైన్యాన్ని గట్టిగా శాసించగల స్థితిలో పౌర ప్రభుత్వం లేదు. అందువల్ల శైశవావస్థలోని పాకిస్థాన్ ప్రజాస్వామ్యం మళ్ళీ సైన్యం పదఘట్టనల కింద నలిగిపోకుండా చూడటం కూడా ఆ దేశంలో ప్రజాస్వామ్య పునాదులు బలపడటానికి ఎంతైనా అవ సరం. అందువల్ల ఉద్రిక్తతలకు తావివ్వకుండా శాంతి- స్నేహ- సహకారాలను వృద్ధి చేసుకోవటంలోనే ఉపఖండంలోని ఈ రెండు దేశాల ప్రయోజనాలు ఇమిడివున్నాయి. ఈ బాటను ధ్వంసం చేయ టానికి టెర్రరిస్టులు ప్రయత్నిస్తూనే వుంటారు.
వారి దుర్మార్గ వ్యూహాల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం నిరంతర నిఘాతో వ్యవహరించాలి. భారత-పాకిస్థాన్ నాయకుల సమావేశాన్ని, సంబంధాల మెరుగుదలను ఆహ్వానిస్తూ చైనా వార్తా సంస్థ క్సిన్హువా విశ్లేషకుడు వ్యాఖ్యా నించినట్లు పొరుగుదేశాల మధ్య శాంతియుత సహజీవన మొక్కటే సరైనమార్గం. భారత-చైనా మధ్య సరిహద్దువివాదం వంటి కొన్ని అపరిష్కృత సమస్యలున్నప్పటికీ, వాటిని చర్చలకు వదిలిపెట్టి ఇరు దేశాలు వాణిజ్యాభివృద్ధిపై కేంద్రీకరించాయి. ఇరుదేశాల ఉన్నత స్థాయి నేతలు తరచూ కలుసుకుంటూ అందుకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. భారత, పాకిస్థాన్‌లకు కూడా ఇప్పటికి అదే అనుసరణీయ మార్గం.


