అంతర్వేదిలో జన్మభూమి ప్రత్యేకాధికారి పూజలు
- 72 Views
- wadminw
- January 4, 2017
- Home Slider సినిమా
తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని జన్మభూమి జిల్లా ప్రత్యేకాధికారి, చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్ మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన స్వామి వారికి పూజలు చేసి, ఆశీర్వచనం పొందారు. అనంతరం మాట్లాడుతూ త్వరలో చేనేత కార్మికులకు ఆరోగ్య కార్డులు, అర్హులందరికి పింఛన్లు అందజేస్తామన్నారు.
రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని, పక్కా గృహాల మంజూరుతోపాటు రూ. లక్షతో వర్క్ షెడ్లు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఆయన వెంట డివిజనల్ ప్రత్యేకాధికారి రామ్మోహన్, అమలాపురం ఇన్ఛార్జి ఆర్డీవో అనురాధ, తాహసీల్దారు సుధాకర్రాజు, సర్పంచి నాగేంద్రకుమార్, వీఆర్వో బాబులు తదితరులున్నారు.
Categories

Recent Posts

