అంతర్ రాష్ట్ర జలవివాదం పరిష్కారానికి కృషి: వివేక్
- 95 Views
- wadminw
- January 2, 2017
- Home Slider జాతీయం
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆయనను మంగళవారం కాచిగూడ నింబోలిఅడ్డలో మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకుడు ఎస్.గోపాల్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎక్కాల చైతన్యకన్నా, మాజీ డిప్యూటీ మేయర్ సుభాశ్ చందర్జీ, రమేశ్‌యాదవ్, రాజేందర్‌పటేల్‌గౌడ్, బొజ్జం సాయిబాబా, ఎస్.రమేశ్‌కుమార్, దశరథ్జీ, వెంకట్రావు, శంకర్జీ తదితరులు పాల్గొన్నారు.


