అందరి కృషి ఫలితమే డిజిటల్ ఇండియా అవార్డు
- 86 Views
- wadminw
- December 22, 2016
- Home Slider జాతీయం
జివియంసి మరిన్ని అవార్డులను పొందాలని, మరింత అభివృద్ధి సాధించాలని జిల్లాకలెక్టర్, జివియంసి ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్ ఆకాంక్షించారు. డిజిటల్ ఇండియా అవార్డులు 2016 గొల్డెన్ కేటగిరీలో జివియంసి డిశంబరు 19న కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యులు రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా స్వీకరించడం పట్ల కమీషనర్ హరినారాయణన్‌ను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అభినందించారు.
కలెక్టరేట్లో జిల్లాకలెక్టర్, జివియంసి ప్రత్యేక అధికారిని కలసి అవార్డు, ప్రశంస పత్రాని జిల్లాకలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలసి అందజేశారు. కాగా, జివియంసి విభాగధిపతులు, అధికారులు, సిబ్బంది సమన్వయ కృషి ఫలితమే డిజిటల్ ఇండియా అవార్డులు 2016 గోల్డెన్ కేటగిరీగా కమీషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. తన ఛాంబర్లో అవార్డు పొందినందుకు అధికారు, సిబ్బంది కమీషనర్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరి సమిష్టికృషికి నిదర్శనమని, అభినందించినందుకు అందరికి కృతజ్ఞతలని కమీషనర్ పేర్కొన్నారు.


