అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక మహిళ మృతి
- 93 Views
- wadminw
- September 5, 2016
- తాజా వార్తలు
అనంతపురం: అనంతపురం నుంచి బెంగళూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో పుట్టపర్తి వద్ద ఆక్సిజన్ అయిపోవడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.
అనంతపురం వేణుగోపాలనగర్‌కు చెందిన శోభారాణి అనారోగ్యానికి గురికావడంతో జిల్లా ఆస్పత్రి వైద్యుల సూచనమేరకు మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో బెంగుళూరుకు పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆక్సిజన్ అయిపోయింది. దాంతో శోబారాణి అంబులెన్స్‌లోనే మృతిచెందింది. అంబులెన్స్ సిబ్బంది ఆక్సిజన్ ఉందోలేదో చూసుకోకపోవడంవల్లే శోభారాణి మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
Categories

Recent Posts

