అక్రమానికి ఆదర్శం జగన్: మంత్రి పల్లె విమర్శ
గుంటూరు: కడిగిన ముత్యంలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించే నైతికహక్కు, అర్హత ప్రతిపక్ష నేత జగన్కు లేవని ఐటిశాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాడిస్టు, అవినీతి, అక్రమానికి ఆదర్శానికి అన్యాయానికి, అసత్యానికి ప్రతీక అయిన వ్యక్తి ప్రతిపక్ష నేత కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని అన్నారు. పేరులోనే గన్ ఉన్న జగన్ గన్లను మాత్రమే వాడుతారని అన్నారు. జగన్ మాదిరిగా లోకేష్ తండ్రి అధికారాన్ని వాడుకోవడం లేదన్నారు. జగన్కు చంద్రబాబుకు భూమి, ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు.
Categories

Recent Posts

