అక్రమార్కుల వద్ద దొరికిన కొత్త కరెన్సీ తిరిగి బ్యాంకుల్లోకి
నోట్ల రద్దు తర్వాత పట్టుబడిన దాదాపు రూ. 100 కోట్ల కొత్త నోట్లను మళ్లీ తిరిగి వాటిని కూడా బ్యాంకులు, అర్బీఐ అధికారుల సహకాంతో నొక్కేస్తుండగా, వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న కోట్ల కొద్దీ కరెన్సీని ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ, ఈడీ అధికారులు తిరిగి వ్యవస్థలోకి పంపాలని నిర్ణయించారు. ఈ డబ్బును వివిధ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో కొత్త ఖాతాలను తెరిచి డిపాజిట్ చేయాలని నిర్ణయించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమల్‌సింగ్ స్పష్టం చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయ పన్ను శాఖ సహా పోలీసుల సోదాల్లో బట్టుబడిన డబ్బులో నూతనంగా ముద్రించిన రూ. 2 వేల నోట్లే ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రధాన నగరాల్లో బ్యాంకు ఖాతాలు తెరిచిన ఈడీ… కొత్త నోట్లతో సహా పట్టుబడిన మొత్తం సొత్తును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందిగా జోనల్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
కరెన్సీ నోట్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ డైరెక్టర్ కర్నాల్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన సొమ్ము తిరిగి ప్రజలకు చేరుతుందని ఆయన వివరించారు.
డబ్బుతో పాటు స్వాధీనం చేసుకున్న ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచనున్నట్టు వెల్లడించారు. ఈడీ మాదిరిగానే, ఆదాయపు పన్ను వాఖ సైతం అధినంలోని డబ్బును బ్యాంకు ఖాతాల్లో వేయాలని మోదీ ప్రభుత్వం సూచించింది. వాస్తవానికి ఇలా పట్టుకున్న డబ్బును కేసులు పరిష్కారం అయ్యే వరకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసి, లాకర్లలో ఉంచేవారు. ఏళ్ల కొద్ది ఈ ధనం నిరుపయోగంగా ఉండేది. ఇప్పటిక ఇది బ్యాంకులకు ఇస్తే వ్యవస్థలో కాస్తంతైనా నోట్ల కొరత తీరుతుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.


