అతి తక్కువ రోజులు సీఎంగా చేసింది వీరే
- 64 Views
- admin
- May 21, 2018
- జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు సినిమా స్థానికం
(ప్రత్యేకప్రతినిధి-ఫీచర్స్ఇండియా)
సీఎం పదవికి రాజీనామా చేసిన అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న నేతల్లో ఒకరిగా నిలిచారు. మూడో రోజే సీఎం పదవికి రాజీనామా చేసిన యడ్డీ.. రోజుల వ్యవధిలో సీఎం పదవి నుంచి వైదొలగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2007లోనూ యడ్యూరప్ప 8 రోజుల్లోపే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో తక్కువ రోజులు సీఎం పీఠంపై కూర్చున్న నేతల వివరాలు..
జగదాంబిక పాల్ యూపీ సీఎంగా ఒక్క రోజు మాత్రమే పని చేశారు. 1998 ఫిబ్రవరి 21న రాత్రి సమయంలో సీఎంగా ప్రమాణం చేసిన ఆయన మరుసటి రోజు ఉదయాన్నే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బిహార్ సీఎంగా సతీష్ ప్రసాద సింగ్ ఐదు
రోజులు మాత్రమే పని చేశారు. 1968 జనవరి 28 నుంచి ఆయన ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఓం ప్రకాశ్ చౌతాలా 1990లో 4 రోజులపాటు హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది కూడా ఆయన 14 రోజులపాటు సీఎంగా పని చేశారు. గోవా సీఎంగా రవి నాయక్ 1994లో ఆరు రోజులపాటు కొనసాగారు. నితీష్ కుమార్ 2007లో కేవలం వారం రోజులు మాత్రమే బిహార్ సీఎంగా వ్యవహరించారు. 2016లో హరీశ్ రావత్ ఒక్క రోజు మాత్రమే ఉత్తరాఖండ్ సీఎంగా పని చేశారు. ఎంజీ రామచంద్రన్ మరణం తర్వాత ఆయన భార్య జానకీ రామచంద్రన్ 23 రోజులు మాత్రమే తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు.


