అనుష్కపై యంగ్ హీరో కామెంట్!
తెలుగు ఇండస్ట్రీలోకి సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ అనుష్క అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అసలే యోగ టీచర్ దాంతో మంచి ఫిజిక్ మెయింటేన్ చేయడం అనుష్కకు మొదటి నుంచి అలవాటు. ఆ మధ్య సైజ్ జీరో చిత్రం గురించి బరువు పెరగడంతో ఆమెలో కొన్ని మార్పులు వచ్చాయి. అయితే బాహుబలి చిత్రం కోసం అహర్శిశలూ కష్టబడి స్లిమ్‌గా అయినట్లు సమాచారం. తెలుగు ఇండస్ట్రీలో ఊహలు గుస గుసలాడే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు.
ఆ మధ్య కొణిదెల నిహారికతో నటించిన ఒక మనసు చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఈ మధ్య మల్టీస్టారర్ చిత్రంగా రూపొందిన జ్యో అచ్యుతానంద చిత్రం ఘన విజయం సాధించింది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నాగశౌర్య ,రెజీనా నటించారు. చిత్రం విజయవంతం కావడంతో సక్సెస్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగశౌర్య ఓ టీవి చానల్లో మాట్లాడుతూ తనకు అనుష్క అంటే చాలా చాలా ఇష్టమని, ఆమెతో నటించాలంటే బాహుబలి లెవెల్లో పోటీలో పాల్గొనాలని అన్నారు. అంతే కాదు పెళ్లి తర్వాత విడాకులకు ఆప్షన్ ఉందని సంచలన వ్యాఖ్యాలు చేశారు. మొత్తానికి అనుష్క అంటే పడి చచ్చే శౌర్య ఆమె తన కళల రాణి అని అంటున్నాడు.


