అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సక్సెస్
- 62 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
విజయవాడ, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): విజయవాడ నగరానికి ముఖ్యమంత్రి చొరవ నేపధ్యంలో నూతన ఒరవడికి నాందిగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్ 2016 నిలిచిందని నగర మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. ఈ వేడుకలకు నగర ప్రజల నుండి, రాజధాని ప్రాంతానికి సందర్శించే వివిధప్రాంతాల సందర్శకుల ద్వారా ప్రశంసలు అందుతున్నాయన్నారు. స్థానిక పిడబ్ల్యుడి గ్రౌండ్ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాజధానిప్రాంతంలో తొలిసారిగా విజయవాడ నగరంలో షాపింగ్ పెస్టివల్ నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో అందుకనుగుణంగా అధికారులు ద్వారా చర్యలు చేపట్టామన్నారు.
అక్టోబర్ 6 వ తేదిన ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎఎస్ఎఫ్ 2016 ను ప్రారంభించామని అక్టోబర్ 7 నుండి పూర్తిస్థాయిలో కార్యాక్రమాల నిర్వహణ చేపట్టామన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కతిక కార్యక్రమాలు నగర ప్రజలను ఒక కొత్త అనుభూతిని మిగుల్చుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ స్కూల్స్‌కు చెందిన విద్యారులు రకరకాల సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సాంస్కతిక కార్యక్రమాలకు జనాదరణ బాగా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాలకు నగర వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తోందన్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచే వివిధ పారశాల విద్యారులు అనంతరం ప్రముఖ వ్యక్తులచే నేపధ్యగీతాలు మిమిక్రీ , కామెడిస్కిడ్ లు తో అక్కడ నిర్వహించే సాంస్కతిక కార్యక్రమాలకు జనం బాగా వస్తున్నారు. పీడబూడీ ద్రౌండ్లో నిర్వహించే తంబోలా ఆటతో కూడా చాలా మహిళలకు తోడు మగవాళ్లు కూడా ఆడుతున్నారు. ఈ తంబోలా ఆటకు ఆదరణ చాలా బాగుంది కొద్ది సేపు నగర వాసులకు ఇది ఒక ఆటవిడుపగా ఉందని పలువురు పేర్కొన్నారు. భవిష్యత్తులో విజయవాడను గుర్తుపెట్మకునే విధంగా మంచి మంచి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపకల్పనకు కృషి చేస్తున్నారన్నారు. సాంసృతిక కార్యక్రమాల్లో యాంకర్‌గా చిత్రలేఖ వ్యవహరించారు.
ప్రముఖ గాయకుడు అనుదీప్ కొన్ని ప్రముఖ సినీగీతాలను ప్రత్యేకంగా ఆలపించారు. నేపధ్యగాయని గాయకులుగా హర్షిత, శ్రీరామ్ మమన్, శ్రీ లలిత లు వివిధ రకాల ప్రముఖ సినిమా పాటలు ఆలపించారు. అమరావతి షాపింగ్ ఫెస్టివల్లో ప్రముఖంగా కామెడీని శాంతి కుమార్ ప్రదర్శించి నగర వాసుల్లో ఉత్సాహాన్ని నింపారు. లక్కీడీప్ డ్రా తీయటానికి ముఖ్య అతిధిగా విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ చేతుల మీదుగా నిర్వహించారు.


