అర్జీల పరిష్కారంలో జాప్యం నివారణ: కలెక్టర్
ఏలూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): జిల్లాలో ప్రజల నుండి వచ్చే మీ-కోసం అర్జీల పరిష్కారం విషయంలో దాటవేసే ధోరణిలో కాకుండా న్యాయబద్ధంగా పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరు కార్యాలయంలో శుక్రవారం తహశీల్ధార్లు, యంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వివిధఅంశాలపై కలెక్టరు సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మీ-కోసం అర్జీలలో కేవలం పదిశాతం మాత్రమే నాణ్యమైన రీతిలో పరిష్కారం అవుతున్నాయని 90 శాతం అర్జీలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అర్జీలు పరిష్కారం విషయంలో ఒకరినుండి వేరొక శాఖకు బదిలీ చేస్తూ తనపని అయిపోయినట్లుగా చేతులు దులుపుకోవడం లేదా మొక్కుబడిగా పరిష్కారం చేసినట్లుగా చూపుతున్నారని కలెక్టరు అన్నారు. ప్రజలు వారు పడే బాధలను అర్జీల రూపంలో తెలియజేస్తూ వాటి సత్వర పరిష్కారం కోరుకుంటారని ఆసమస్య పరిష్కారం అయితే ఎ న్నో ఏళ్లుగా ఉన్న ఒత్తిడిల నుండి కొంతమంది విముక్తి పొందుతారని కాబట్టి అధికారులు అర్జీల విషయంలో ఏమాత్రం చిన్నచూపు చూడకుండా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. సరైన విచారణతో ఆలశ్యానికి తావులేకుండా సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఉదయం నుండి రాత్రి వరకూ ఎ ంతో ఒత్తిడితో పనిచేయడం కాదని అధికారులు స్మార్ట్‌గా అలసట లేకుండా స్పీడుగా పనిచేయాలని కలెక్టరు డా. భాస్కర్ చెప్పారు. తహశీల్ధార్లు వారి లెవెల్లో అయ్యే అర్జీలు కూడా జాయింట్ కలెక్టరు వారి వద్దకు తన వద్దకు రావడం ఏమిటని కలెక్టరు ప్రశ్నిస్తూ అధికారులు సరిగ్గా స్పందించకపోవడం వలనే అర్జీదారులు మమ్ములను ఆశ్రయిస్తున్నారని కలెక్టరు చెప్పారు. అధికారులు వారి స్ధాయిలో పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించకపోవడం వలన సమయం సొమ్ములు వృధా చేసుకుని చాలా దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారని కలెక్టరు అన్నారు. చేపల చెరువుల అనుమతులపై కలెక్టరు అధికారులతో సమీక్షిస్తూ అనుమతులుకోసం వచ్చే ధరఖాస్తులను పరిశీలించి నిబంధనలకు అనుకూలంగా ఉంటే ఏమాత్రం ఆలశ్యం చేయకుండా అనుమతులు మంజూరు చేయాలని నిబంధనలు ప్రకారం లేకుంటే అందుకు కారణాలను ఖచ్చితంగా తెలియజేస్తూ తిరస్కరించాలని అన్నారు. చట్టప్రకారం ఉంటే పనులను వెంటనే చేయాలని నిబంధనలు ప్రకారం లేనివాటిని ఎ ప్పటికీ చేయవద్దని అధికారులకు కలెక్టరు సూచించారు. జిల్లాలో డిశంబరు నెలాఖరులోగా తెల్లరేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతీ ఒక్కరికీ దీపం పధకం క్రింద గ్యాస్ కనెక్షన్లు అందజేయాలని జనవరి 1వ తేదీ నుండి జిల్లాలో ఏఒక్కరూ కట్టెలపొయ్యి, కిరోసిన్ పొయ్యిలు వాడే అవసరం లేని విధంగా గ్యాస్ కనెక్షన్లు అందించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ఏజెన్సీల వారు ఎ క్యుప్మెంట్ ఉండి అందుకు తగిన విధంగా ధరఖాస్తులున్నప్పటికీ కనెక్షన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సంబంధిత తహశీల్ధార్లు ఈవిషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి కనెక్షన్లు వెంటవెంటనే లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ వారం జరిగే వీడియోకాన్ఫరెన్స్‌కు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు కూడా వచ్చేవిధంగా తహశీల్ధార్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫైళ్ల పరిష్కారం విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తలు వహించాలని పూర్తిగా కంప్యూటరు ఆపరేటర్లుపై వదిలివేయడం వలన వారు చేసే తప్పులు డిజిటల్ సంతకాలు చేసిన అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని ఎ వరు పొరపాటు చేసినా డిజిటల్ సంతకం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టరు హెచ్చరించారు. ఫైళ్ల పరిష్కారంలో అధికారులు కంప్యూటరు పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కంప్యూటరు ఆపరేటర్లపై ఆధారపడకుండా అధికారులే ఫైళ్లను పరిష్కరించుకునేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్నీ మున్సిపాల్టీల్లో అక్టోబరు 2వ తేదీ నాటికి బహిరంగ మలవిసర్జన లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఈలోగా మున్సిపాల్టీల్లో పెండింగ్ లో ఉన్న 68 టాయిలెట్లను పూర్తి చేయాలని అక్టోబరు 3వ తేదీ నుండి ఎ క్కడైనా బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు గమనిస్తే అందుకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు హెచ్చరించారు. జిల్లాలో ఉపాధి హామి పధకం ద్వారా నిర్మించే మరుగుదొడ్లు నత్తనడకగా సాగుతున్నాయని వారంవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నప్పటికీ పురోగతి కనిపించడం లేదని కలెక్టరు చెప్పారు. ఫామ్ పాండ్స్ అంశాన్ని సమీక్షిస్తూ వేలేరుపాడు, కుకునూరు, పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో ఈవారం 34 ప్రారంభించాల్సి ఉండగా ఏఒక్కటీ కూడా ప్రారంభించలేదని అందుకు కారణాలను పిఓ ఐటిడిఏ శ్రీ షాన్ మోహన్‌ను కలెక్టరు ప్రశ్నించారు. ఈవిధంగా పనులు జరిగితే మీకిచ్చిన నిర్ధేశం ఎ ప్పటికీ మీరు పూర్తి చేస్తారని పూర్తిగా ఈపనులను నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇది ఎ ట్టిపరిస్ధితుల్లో సహించేది లేదని కలెక్టరు హెచ్చరించారు. గృహనిర్మాణ పధకం యన్ఆర్ ఇజియస్ ద్వారా చేపట్టే పనులను సమీక్షిస్తూ ప్రతీ యంపిడిఓకు అర్హులైన లబ్దిదారుల లిస్టు పంపడం జరిగిందన్నారు. ఎవరికి జాబ్ కార్డులున్నాయో లేవో ఎవరికి జనరేట్ చేయాలో వారి ఆధార్ నెంబర్లు, బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుపవలసిందిగా కోరామని పిడి డ్వామా వెంకటరమణ కలెక్టరు భాస్కర్‌కు వివరించారు. వాటిని వెంటనే పంపవలసిందిగా కలెక్టరు యంపిడిఓలను ఆదేశించారు. ఇంకా 3 వేల 391 బ్యాంకు అకౌంట్ వివరాలు రావాల్సి ఉన్నదని వాటిని త్వరితగతిన పంపాలని కలెక్టరు చెప్పారు. ఈ సమావేశంలో జడ్పి సిఇఓ సత్యనారాయణ, యస్ఇ ఆర్‌డబ్ల్యుయస్ అమరేశ్వరరావు, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, డియస్ఓ శివశంకరరెడ్డి, డిఆర్డిఏ పిడి కె. శ్రీనివాసులు, డ్వామా పిడి వెంకటరమణ, ఫిషరీస్ డిడి జాకబ్ భాషా, యన్ఐసి శర్మ, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బయోమెట్రిక్ హాజరుపై కలెక్టర్ నిశిత పరిశీలన
ఏలూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయని ప్రజల్లో ప్రశ్నించే తత్వం కూడా పెరుగుతున్న దృష్ట్యా పారదర్శకపాలన దిశగా ప్రతీ ఒక్కరూ పనిచేసి ప్రజలకు సత్వర సేవలు అందించాలనే ప్రధాన లక్ష్యంతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను కోరారు. స్ధానిక కలెక్టరు కార్యాలయంలో శుక్రవారం జనన, మరణ ధృవీకరణ పత్రాలు, బయోమెట్రిక్ హాజరు, శానిటేషన్, తదితర అంశాలపై పంచాయతి అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు, ఇబ్బందులు తెలుసుకుని అందరికీ మేలుచేసేలా గ్రామస్ధాయి పాలన మరింత వేగవంతంగా జరగాలని భవిష్యత్తులో ప్రజలు ఎ క్కడనుండైనా ఆన్లైన్ ద్వారానే అన్నీరకాల ప్రభుత్వసేవలు పొందేవిధంగా పంచాయతి పరిపాలన తీర్చిదిద్దాలని భాస్కర్ చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే ఉద్యోగుల్లో పనిభారమే ఉండబోదని ఇది ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని కలెక్టరు చెప్పారు. ఆదాయ, కుల, జనన, మరణ, ఇళ్లపన్ను, పంపుపన్ను, తదితర సేవలు గతంలో పొందాలంటే పదిరోజులుపాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితి ఉండేదని నేడు ఆన్లైన్లో క్షణాలలో పౌరసేవలు పొందే వెసులుబాటు కల్పించామని దీనివలన ఆయా గ్రామాలలో పంచాయతి కార్యదర్శులకు, విఆర్ఓలకు పనిభారం తగ్గిపోయిందని కలెక్టరు చెప్పారు. ప్రస్తుతం పల్లెల్లో పారిశుద్ధ్య పరిస్ధితులు మెరుగుపరిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రతీ ఏటా జిల్లాలో ప్రజల అనారోగ్యం వలన 700 కోట్ల రూపాయలు మందులకోసం వెచ్చిస్తున్నారని అంతేకాకుండా వారు శారీరకంగా కూడా బాగా దెబ్బతింటున్నారని ఇటువంటి స్ధితిలో పల్లెల్లో పరిసరాల పరిశుభ్రత ఖచ్చితంగా అమలు చేస్తే ప్రతీ మనిషీ ఆరోగ్యవంతంగా జీవించగలుగుతాడని తద్వారా ప్రజలకు వందలాదికోట్ల రూపాయలు అనవసర మందుల ఖర్చు ఉండబోదని భాస్కర్ చెప్పారు. జపాన్, కొరియా దేశాలలో రోడ్డుప్రక్క చెత్తకుండీలు కూడా ఉండవని ఆదేశాలలో ప్రజలు వినియోగించిన తర్వాత వ్యర్ధపదార్ధాలను రోడ్డుపై వేయడానికి సిగ్గుపడతాడని చాక్లెట్ తింటే పేపరు జేబులో ఉంచుకుని ఇంటికెళ్లి డస్ట్ బిన్లో వేస్తాడే తప్ప ఎ క్కడాకుడా రోడ్డుపైన పడవేయడని ఆవిధానం, ఆసంస్కృతి ప్రతీ ఒక్కరిలో పెరిగితే సమాజమంతా ఆరోగ్యవంతంగా ఉంటుందని డా. భాస్కర్ చెప్పారు. భవిష్యత్తులో వీధిలైట్లన్నీ ఆన్లైన్ ః- జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో రెండు లక్షల 75 వేల విద్యుత్తు స్ధంభాలున్నాయని అయితే ఇప్పటివరకూ ఒక లక్షా 90 వేల స్ధంభాలకు వీధిలైట్లు ఏర్పాటుచేసామని అన్నీ వీధిలైట్లనూ యల్ఇడి బల్భ్లుగా మార్పు చేసి త్వరలో ఆన్లైన్ ద్వారా వాటి ఆఫ్ అండ్ ఆన్ విధానాన్ని అమలు చేస్తామని దీనివలన విద్యుత్తు ఆదాతో పాటు పొదుపు కూడా చేయగలుగుతామని డా. భాస్కర్ చెప్పారు. పంచాయతీలు కరెంటుబిల్లులు చెల్లించలేక ఇబ్బందులుపడే పరిస్ధితులు తొలగిపోతాయని గతంలో నెలకు ఐదు వేల రూపాయలు కరెంటు బిల్లు వస్తే నూతన విధానం వలన మూడు వేల రూపాయల వరకూ తగ్గించగలుగుతామని ఆదా అయిన సొమ్ములో సగం పంచాయతి, సగం ఆన్లైన్ నిర్వాహణా వ్యయం క్రింద వినియోగించే వెసులుబాటు చేయవచ్చునని కలెక్టరు చెప్పారు. రాష్ట్రంలో సామాన్య ప్రజానీకం కూడా ఎ టువంటి కష్టాలు పడకుండా ఉండాలన్నదే ప్రభుత్వోద్ధేశ్యమని ఆదిశగా పాలనలో నూతన సంస్కరణలతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు ఇంటివద్దనే మెరుగైన సేవలు కల్పించడానికి పశ్చిమ గోదావరి జిల్లా చేపట్టిన నూతన విధానం రాష్ట్రమంతా అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ప్రకటించడం జిల్లా కీర్తిప్రతిష్ట మరింత పెరిగిందని డా. భాస్కర్ చెప్పారు. జిల్లాలో పల్లెల్లో ఎ లక్ట్రానిక్ పాలన అమలు చేయడంలో పంచాయతి అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి ఫలితంగా ముఖ్యమంత్రి నుండి ప్రశంస పొందగలిగామని భవిష్యత్తులో కూడా ప్రతీ ఒక్కరూ పనిచేసే చోటే ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత సమర్ధవంతమైన సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. పనులు సక్రమంగా జరగాలంటే ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నప్పుడే నూరుశాతం ఫలితాలు వస్తాయని అన్నారు. శానిటేషన్ అంటే చీపుర్లతో ఊడవడం మాత్రమే కాదని చెత్తను కుప్పలుగా ఒకచోట పోగుచేసి ఆకుప్పలను వాహనాలు ద్వారా డంపింగ్ యార్డులకు తరలించి ఎ ప్పటికప్పుడు వీధులను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. ప్రతీ పంచాయతి కార్యాలయంలోనూ కంప్యూటరుతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని జనన మరణ ధృవీకరణపత్రాలను డిజిటల్ సంతకంతో ఆన్లైన్లో పొందుపరిచి పంచాయతి కార్యాలయం నుండే డిజిటల్ సంతకాలతో కూడిన జనన మరణ ధృవీకరణ పత్రాలను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు కావాల్సినవారు వారి ఆధార్ నెంబరుతో స్వయంగా తీసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. గతంలో కరెంటుబిల్లు కట్టాలంటే కుటుంబంలో ఎవరో ఒకరు లైన్లో నిలబడడం ద్వారా ఒక రోజంతా కేటాయించవలసి వచ్చేదని ఉద్యోగులైతే ఒకరోజు సెలవుపెట్టడమో లేదా కొన్ని గంటలు పర్మిషన్ పెట్టో కరెంటు బిల్లులు కట్టేవారని నేడు ఆపరిస్ధితి పూర్తిగా మారి మొబైల్ నుండే కరెంటు బిల్లులు చెల్లించే పరిస్ధితులు వచ్చి ఎంతో సమయం ఆదా అవుతోందని చెప్పారు. సమాజం నుండి మనం ఏమి కోరుకుంటున్నామో మనం కూడా సమాజానికి ఆవిధంగానే సేవలు అందించాలని ప్రజలకు సేవలు అందించడమే మొట్టమొదటి లక్ష్యంగా అధికారులు భావించాలని కలెక్టరు భాస్కర్ చెప్పారు. వచ్చేవారం లోగా ప్రతీ ఒక్కరూ నూరుశాతం బయోమెట్రిక్ అటెండెన్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతి అధికారి సుధాకర్‌ను కలెక్టరు ఆదేశించారు. అధికారులు వారుపనిచేసే ప్రాంతాలలో నివాసం ఉండకపోవడం వలన ప్రజలకు సరైన సమయంలో సేవలు అందించలేకపోతున్నారని పిల్లల చదువులు నిమిత్తం లేదా వైద్యసౌకర్యాలు లేవనో వేరే ప్రాంతాల్లో ఉంటున్నారని చెప్పడం సరైనది కాదని ప్రతీ ఒక్కరూ వారు పనిచేసే ప్రాంతంలో ఉంటే సౌకర్యాలు కూడా అందుతాయని సౌకర్యాలు లేవనే నెపంతో వేరేప్రాంతంలో నివాసముండేవారు ఉద్యోగం విడిచి వెళ్లవచ్చని కలెక్టరు చెప్పారు. ప్రజల్లో ఎ ంతో చైతన్యం వచ్చిందని వారికి అందాల్సిన సౌకర్యాలు సకాలంలో వారికి అందకపోతే అధికారులను నిలదీసే పరిస్దితి ఉందని కాబట్టి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా సకాలంలో వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టరు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతి అధికారి కె. సుధాకర్, ఏలూరు డివిజినల్ పంచాయతి అధికారి రాజ్యలక్ష్మి, నరసాపురం జి. శ్రీరాముడు, జంగారెడ్డిగూడెం వై. అమ్మాజీ, కొవ్వూరు వియస్యస్వి. ప్రసాద్, ఇఓఆర్‌డిలు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో ఘనంగా చిన్నపత్రికల దినోత్సవం
ఏలూరు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): సమాజ చైతన్యానికి చిన్నపత్రికలు ఎంతో దోహదపడుతున్నాయని ఎమ్మెల్సీ రాము సూర్యారావు (ఆర్యస్ఆర్ మాస్టార్) చెప్పారు. చిన్నపత్రికల దినోత్సవం సందర్భంగా ఎడిటర్స్ అండ్ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీస్త్రీలు, బాలింతలకు శుక్రవారం ఆయన పండ్లు, రొట్టెలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్న చిన్నపత్రికల సేవలు ప్రశంసనీయమని సూర్యారావు చెప్పారు. సమాజంలో పేదవర్గాల సంక్షేమాన్ని చూడడంలో దాతలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు సేవలు చేయడం ఎంతోకష్టతరమైనప్పటికీ పలు స్వచ్ఛంధ సంస్ధలు సేవకులు రోగులకు సేవలందించడానికి ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. సమాజంలో చిన్నపత్రికలకు ఆర్ధిక ఆదరణ లేకపోయినప్పటికీ సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్నపత్రికలను ఎంతో క్రమశిక్షణతో నడుపుతున్న జర్నలిస్టులను ఆయన అభినందించారు. సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టరు వి. భాస్కరనరసింహం మాట్లాడుతూ ఏలూరులో చిన్నపత్రికలు ఎంతో క్రమశిక్షణతో నడుపుతున్నారని ప్రతీరోజూ వార్తలను సాయంసమయంకల్లా ప్రజలకు అందించడంలో చిన్నపత్రికలు ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాయని సమాజంలో ప్రజలను చైతన్యపరిచి ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు చిన్నపత్రికలు చేస్తున్న కృషి ఎంతో ఉందని భాస్కరనరసింహం చెప్పారు. చిన్నపిల్లలు, బాలింతలకు రొట్టెలు, పండ్లు పంచి పెట్టడానికి ముందుకు వచ్చిన ఎడిటర్స్, జర్నలిస్టులను ఆయన అభినందించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవారధిగా పత్రికలు పనిచేస్తున్నాయని ఎన్నికష్టాలున్నా చిన్నపత్రికలు నిర్వహిస్తున్నారని ప్రజలే పత్రికలను ఆదరించాలని ఆయన కోరారు. ఎడిటర్స్ , జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ చిన్నపత్రికల నిర్వాహణ ఎంతో భారమైనప్పటికీ ప్రజలకు సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలనే సంకల్పంతో చిన్నపత్రికలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎడిటర్స్ , జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కంది వెంకట ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ వార్షికోత్సవ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిసున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కొల్లు శ్రీనివాసరావు, కోశాధికారి బివి రామారావు, రత్నాకర్, కొప్పు మోహన ఆంజనేయులు, పామర్తి యోగేశ్వరరావు, బుద్ధాల మధుసూధనరావు, జి. ప్రసంగిరాజు తదితరులు పాల్గొన్నారు.


