ఆంధ్రా యూనివర్సిటీలో శాంతి ర్యాలీ విజయవంతం
- 105 Views
- wadminw
- September 21, 2016
- అంతర్జాతీయం
విశాఖపట్నం, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): ప్రపంచ దేశాలు నేడు శాంతిని కోరుకుంటున్నాయని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఉదయం ఏయూ పరిపాలనా భవనం వద్ద ప్రపంచ శాంతి దినోత్సవ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ శాంతి స్థాపనకు యువతరం కృషిచేయాలన్నారు. శాంతిని భగ్నం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్నారు.
ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో పోరాటం చేయాలన్నారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు పౌరులంతా రుణపడి ఉండాలన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అణచివేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ శాంతితోనే మానవాళికి రక్షణ కలుగుతుందన్నారు. మానవుల ఆలోచనల్లో పరివర్తన తీసుకురావడం ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు.
ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య ఎన్.ఏ.డి పాల్ మాట్లాడుతూ శాంతితోనే దేశాల అభివృద్ది సాధ్యపడుతుందన్నారు. శాంతి పరిఢమిల్లాలనే సంకల్పంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు శాంతిని కాంక్షిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.


