ఆకలితో అధ్యక్షుడినే తరిమికొట్టారు!
- 95 Views
- wadminw
- September 5, 2016
- అంతర్జాతీయం
ఆకలితో అలమటిస్తున్న ప్రజల్ని పట్టించుకోవడంలేదని దేశ అధ్యక్షుడిని ప్రజలు నడిరోడ్డుపై తరిమికొట్టారు. వెనిజ్వెలాలో చోటుచేసుకుంది ఈ ఘటన. వెనిజ్వెలా దేశం ప్రస్తుతం ఆర్థికంగా నష్టాల్లో ఉంది. ఆకలికి కొందరు ప్రజలు ఓ జూలోని గుర్రాన్ని చంపి తిన్నారంటే అక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వూహించవచ్చు. శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు నికోలాస్ మ్యాడురో రాజధాని కారకాస్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరయ్యారు. ఓపక్క తిండి లేక ప్రజలు అలమటిస్తుంటే పట్టించుకోవడంలేదని అలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ కొందరు ప్రజలు కుండలు, గిన్నెలు పట్టుకుని ‘మేము ఆకలితో అలమటించిపోతున్నాం’ అంటూ అతన్ని తరిమికొట్టారు.
వారిని శాంతింపజేయడానికి అధికారులు ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు హ్యుగో ఛావెజ్చనిపోయాక 2013లో నిర్వహించిన ఎన్నికల్లో మ్యాడురో గెలిచాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మ్యాడురో ప్రజల్ని పట్టించుకోకపోవడంతో అతని పాపులారిటీ రోజురోజుకీ తగ్గిపోతోంది. దాంతో మ్యాడురో ప్రత్యర్థులు రిఫరెండమ్ నిర్వహించి అతన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, భారత సంతతికి చెందిన ఓ బ్రిటన్ చట్టసభ సభ్యుడు చిక్కుల్లో పడ్డాడు. అతడిపై సెక్స్ స్కాండల్ ఆరోపణల నేపథ్యంలో తన బాధ్యతలకు తాత్కాలికంగా దూరం జరిగారు. గత చాలా కాలంగా బ్రిటన్‌లో చట్టసభలో ఎంపీగా కొనసాగుతున్న కెయిత్ వాజ్(59) అనే వ్యక్తి లైంగిక వాంచలు తీర్చే మేల్ సెక్స్ వర్కర్లకు డబ్బులు చెల్లించారని ఓ పత్రికలో కథనం వెలువడటంతో అందుకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి పక్కకు జరిగారు. అంతేకాదు, బ్రిటన్‌లో నిషేధించిన ఉత్ప్రేరకాలు కూడా ఆయన కొనుగోలుచేసినట్లు సదరు కథనంలో ఆ పత్రిక పేర్కొంది.
బ్రిటన్‌లో లైసిస్టర్ ప్రాంతం నుంచి 1987 నుంచి ఎంపీగా కెయిత్ వాజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెలలో లండన్‌లోని తన ఫ్లాట్‌కు ఇద్దరు కాల్ బాయ్స్‌ను పిలిపించుకున్నాడని సండే మిర్రర్ ప్రచురించింది. దీంతో త్వరలోనే తాను హౌజ్ ఆఫ్ కామన్స్ హోమ్ అఫైర్స్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ఇందులో ఆయన పదేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. నా చర్యలతో తీవ్రంగా గాయపడిన, ఇబ్బందిపడిన నా భార్య, పిల్లలకు, మొత్తం కుటుంబానికి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో క్షమాపణలు చెబుతున్నాను. మంగళవారం విచారణ కమిటీ ముందు హాజరై పూర్తి వివరణ ఇస్తాను అని కెయిత్ చెప్పాడు. మొత్తం రెండుసార్లు కెయిత్ ఈస్ట్రన్ యూరోపియన్‌కు చెందిన ఆ ఇద్దరితో 90 నిమిషాలపాటు సమావేశం అయ్యాడట. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకొచ్చిందట. ఆ రోజు ఆయన వారికి పంపించిన ఎస్సెమ్మెస్‌లో కొన్ని పరిశీలిస్తే రాత్రి 11 అయింది. నైస్ కానీ బాగా ఆలస్యం. నాకు మంచి విడుపు కావాలి ప్లీజ్ అంటూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయన ఇంకా అధికారికంగా ఎంపీ బాధ్యతల నుంచి తప్పుకోలేదు. విచారణ జరుగుతోంది.


