ఆచరణ సాధ్యం కాని హామీలు
- 106 Views
- wadminw
- September 5, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్: చంద్రబాబు చేసిన పనికి ఏపీలో ఎవ్వడూ పెట్టుబడులు పెట్టడు గాక పెట్టడు ఎన్నికల ముందర ఓటర్లకు చెప్పిన కహానీలు ఎన్నికల తరవాత మన నాయకులు కొంచెం కూడా పట్టించుకోరు. ఎన్నికల మానిఫెస్టో సంగతి పక్కన పెడితే. ఇచ్చిన అతిపెద్ద వాగ్దానాలకి దిక్కు కూడా ఉండదు. పూర్తిగా ప్లేటు ఫిరాయించిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇదే పద్ధతి పెట్టుబడిదారుల దగ్గర చేస్తే ఎలా? ఈ పరిస్థితి ని జనం తట్టుకోగలరు కానీ లక్షల కోట్లు ఇన్వెస్ట్ చెయ్యడం కోసం సిద్దంగా కూర్చున్న పెట్టుబడి దారులు ఏ మేరకు జీర్ణించుకోగలరు?
చంద్రబాబు మీద ఇప్పటికే ఎన్నికల టైంలో ఒచ్చిన రుణమాఫీ లాంటి హామీలు నెరవేర్చలేదు అనే విమర్శలు ఉండనే ఉండగా ప్రజల విషయంలో లాగానే ప్రజా జీవనాన్ని అభివృద్ధి పరిచే పెట్టుబడి విషయంలో కూడా ఆయన వక్రమార్గంలో వెళుతున్నారు అంటూ వేలెత్తి చూపిస్తున్నారు కొందరు. ఉన్న నిబంధనలను సరళ తరం చేసి పెట్టుబడిదారులకి తేలికైన మార్గం చూపిస్తేనే కదా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు ఒచ్చేది కానీ అలా జరగట్లేదు. వారు రాకముందర ఒక మాట ఒచ్చాక ఒకమాటా అన్న చందంగా ఉంది పరిస్థితి. ఈ రాష్ట్రానికి వచ్చి తప్పు చేశామా అని పెట్టుబడిదార్లు భయపడే పరిస్థితిని చంద్రబాబునాయుడు కల్పించారని జనం అనుకుంటున్నారు. జపాన్‌కి చెందిన ఇసుజు వాహనాల కంపెనీ వరదయ్య పాళెం దగ్గర శ్రీ సిటీ సెజ్‌లో తమ కంపెనీని ఏర్పాటు చేసుకుంది.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఏపీలో వచ్చిన అతిపెద్ద కంపెనీ ఇదే అయ్యింది. ఈ యూనిట్ ఏర్పాటు సమయంలో వీరు రాష్ట్రంలో తయారు చేసే వాహనాలకి లైఫ్‌టాక్స్ పూర్తిగా మినహాయిస్తాం అంటూ మీడియాలో హడావిడి, ఆడంబరం కోసం చంద్రబాబు వారికి హామీ ఇచ్చి పడేసారు. నిబంధనల ప్రకారం ఇది కుదురుతుందా కుదరదా అనేది కూడా చూడకుండా బాబు అలా చేసారు. పన్ను మినహాయింపు ఒస్తుంది అనే ఒకే ఒక్క రీజన్‌తో ఆ కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టి ఫాక్టరీ పెట్టడానికి సిద్దం పడింది అనేది అందరికీ అర్ధం అయ్యే విషయం.
అయితే ఈ విషయంలో సర్కారు ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. ఇసుజు ప్రతినిధులతో అధికార్లు భేటీ అయి లైఫ్ ట్యాక్స్ మినహాయింపుకు నిబంధనలు ఒప్పుకోవని రాతపూర్వకంగా తేల్చిచెప్పేశారట. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఒక కంపెనీ స్పెషల్‌గా లైఫ్ టాక్స్ ని ఎగ్గొట్టడం కష్టం అనీ ఈ మినహాయింపు సాధ్యపడదు అని చెప్పారట ప్రభుత్వం వారు. ఆ రోజు ఆయన ఇచ్చిన అడ్డగోలు హామీ కారణంగా ఇప్పుడెందుకు ఏపీలో అడుగు పెట్టాం రా బాబూ అని ఫీల్ అవుతున్నారు ఆ కంపెనీ వారు. ప్రజలకి చెప్పినట్టు సోది కబుర్లు చెప్పి కంపెనీలకి కూడా దొంగ హామీలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎవరు చూస్తారు? ఇస్తామన్న రాయతీలు ఇవ్వకుండా ఎన్నేసి విదేశీ పర్యటనలు చేస్తే ఏం లాభం? వారివి చారిటబుల్ ట్రస్ట్‌లు కావు కదా? ఊరికే సేవ చెయ్యడానికి.


