ఆదిలాబాద్ జిల్లాలో 28 నుంచి పత్తి కొనుగోళ్లు
- 105 Views
- wadminw
- January 2, 2017
- Home Slider రాష్ట్రీయం
ఆదిలాబాద్, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): జిల్లాలలో పత్తి కొనుగోళ్లకు ఎట్టకేలకు ముహూర్త తేదీ ఖరారైంది. విజయదశమి నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉండగా ఈ ఏడాది ఆలస్యంగా జరుగుతోంది. పత్తి కొనుగోళ్ల విషయమై రైతులు ఆందోళనలో ఉండడంతో చివరికి ఈ నెల 28న పత్తి కొనుగోళ్లకు ముహూర్తంగా నిర్ణయించారు. జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు అవుతుండగా ఈ ఏడాది పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాలో ముడన్నర లక్షల హెక్టార్లలో పత్తి సాగు అవుతుండగా ఈ ఖరీఫ్‌లో రెండున్నర లక్షల హెక్టార్లలో తగ్గిపోయింది.
పత్తినే నమ్ముకుంటూ వస్తున్న రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలతోపాటు నష్టాలు తప్పడం లేదు. తక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేయడంతోపాటు మరో పక్క అధిక వర్షాలు కురిసి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీనికితోడు పత్తి క్వింటాల్‌కు 5 వేల నుండి 6 వేల వరకు ఆశించిన రైతులకు ప్రభుత్వం పత్తి క్వింటాల్‌కు 4160 రూపాయల మద్దతు ధర ప్రకటించడంతో మరింత కుంగిపోయారు. గత మూడు వారాలుగా పత్తి కొనుగోళ్ల తేదీ ఖరారు కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి చివరకు ఈ నెల 28 నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో రైతు ప్రతినిధులతో, వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో 12 శాతం వరకు తేమ ఉన్న పత్తిని నెలరోజులపాటు మాత్రమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేయడంతో రైతులు నిరాశలకు గురయ్యారు.
ప్రభుత్వ రంగ సంస్థ అయినా సీసీఐ కొనుగోళ్లు చేస్తామని ప్రకటించినప్పటికీ తీర మద్దతు ధరకంటే తక్వుగా వ్యాపారులు కొనుగోలు చేస్తే తాము రంగంలోకి దిగి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు ప్రకటించారు. కొనుగోళ్లు విషయంలో ప్రతి ఏడాది రైతులు ఇబ్బందులు పడుతున్న పాలకులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఎంతో వయ, ప్రసాలకు ఓర్చి రైతులు పంటలు పండిస్తే కనీసం పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదని రైతుల వాపోతున్నారు. పత్తి కొనుగోళ్లులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి రామన్న ఆదేశాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాల్సిందే.


