ఆరోగ్యానికి మందార రేకుల పొడి మేలు!
మందార పువ్వులు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే మందార పువ్వు ఆరోగ్యానికి మేలు చేసే పలు ఔషధ గుణాలు కలిగివుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మందార ఆకు, పువ్వులు, వేర్లల్లో ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మందార పువ్వులు మహిళల గర్భసంచికి ఎంతో మేలు చేస్తాయి. గర్భసంచి సమస్యలు, వయసు మీద పడినా మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యలకు మందార పూరేకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
మందార పూ రేకులను పేస్ట్ చేసుకుని మజ్జిగలో కలిపి రోజూ తీసుకుంటే మహిళల్లో గర్భసంచి సమస్యలు దూరమవుతాయి. ఇంకా నెలసరి సమస్యలు మటుమాయమవుతాయి. మందార పువ్వుల్ని నీడలో ఎండబెట్టి పొడి చేసుకుని కషాయంలా తీసుకుంటే నెలసరి సమయంలో ఏర్పడే పొత్తికడుపు నొప్పి, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
హృద్రోగ వ్యాధిగ్రస్థులు మందార పూవు రేకులు, తెలుగు తామర పువ్వుకు చెందిన రేకుల్ని కషాయంలా సేవిస్తే గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో గల మలినాలను తొలగిస్తుంది. ఇంకా అజీర్ణానికి చెక్ పెట్టాలంటే నోటిపూతను దూరం చేసుకోవాలంటే రోజూ ఐదు లేదా పది మందారపువ్వుల్ని తీసుకోవడం ఉత్తమం. ఇంకా మందార పువ్వు పొడిని మాడుకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రుకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మరోవైపు, తులసిని అత్యంత పవిత్రంగా కొలిచే వాళ్లు మన పూర్వీకులు. ఉదయం లేవగానే తులసి పూజ చేయకుండా పనులు మొదలు పెట్టేవాళ్లు కాదు. పురాణాలలో కూడా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు.
అత్యంత ఆరోగ్యకరమైన అంశాలు తులసిలో ఉన్నాయి. ఎన్నో ఏళ్ల తరబడి హిందువులు భగవంతుడికి కానుకలు, పువ్వులు సమర్పించడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఎంతో పవిత్రతను, ప్రాధా న్యతను సంతరించుకున్న తులసి నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు దీనిలో ఉన్న ఔషధ గుణాలను సౌందర్య పోషణకు వాడుకుంటున్నారు. ఎందుకంటే తులసి కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలే కాదు మొక్క కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్ర మైనదని, ఔషధాలతో కూడుకున్నదని పద్మ పురాణంలో పేర్కొ న్నారు. తులసి మొక్కను చూసినా లేదా తాకినా అన్ని రకాల ఒత్తిడులు, జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
తులసి మొక్కపై నీళ్ళు పోస్తే భయాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా తులసి మొక్కను నాటినా, నీళ్లు పోసినా వారు కృష్ణుడికి ప్రీతి పాత్రమవుతారని స్కందపురాణం చెబుతోంది. అయితే కేవలం దైవాత్వానికే కాకుండా తులసిలో కొన్ని రకాల ఔషధ గుణాలున్నాయని వైద్య నిపుణులు చెబతున్నారు. ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభా లెన్కో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.
అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి. జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్ స్పూన్ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది. బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయి. దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందు కంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు. తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.
అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తులిసీ దళాలను వేసిస్తారు. తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటున్నారు. ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం.
పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు. నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది. ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే”ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.
ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు. మెడికల్ సైన్స్ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు. వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది.
అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాధించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, అనుఅక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే. ప్రపంచంలో దుస్తులు, ఆహారం, ఆచార వ్యవహారాలు లాంటివాటిలో ఎవరి శైలి వారిదే. అందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు.
కాలం గడిచే కొద్దీ వీటిల్లోనూ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చారు. ఆహారం విషయంలోనూ అలాగే జరిగింది. ఒకప్పుడు మాంసాహారంపై ఆధారపడిన మనిషి వ్యవసాయం నేర్చుకొని శాకాహారంపై దృష్టిసారించాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా కూడా శాకాహారానికి డిమాండ్గ పెరిగిపోతోంది. పలువురు వైద్యనిపుణులు సైతం శాకాహారమే ఆరోగ్యానికి అత్యుత్తమమని సూచిస్తున్నారు. పెటా లాంటి సంస్థలు శాకాహారంపై ప్రచారాన్ని ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. మహాత్మాగాంధీ, ఏపీజే అబ్దుల్ కలామ్, అమితాబ్ బచన్, రుక్మిణిదేవి అరుండాళ్, మోరార్జీ దేశాయి, అనిల్ కుంబ్లే, షాహిద్ కపూర్, కరీనా కపూర్, మల్లయోధుడు సుశీల్‌కుమార్, ఆర్ మాధవన్, రవీంద్రనాథ్ ఠాగూర్, సచిన్ టెండూల్కర్ వీరందరి మధ్య కూడా ఓ సామ్యం ఉంది. వారంతా శాకాహారులే! ప్రజానీకం శాకాహారాన్ని ఇష్టపడేందుకు ఎన్నో కారణాలున్నాయి.
జీవహింస ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మతపరమైన విశ్వాసాలు, జంతువుల హక్కులను గౌరవించడం, ఆరోగ్యం, రాజకీయపరమైన కారణాలు, ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఇందులో ముఖ్యమైనవి. ఎంతో మంది శాకాహారులు ప్యాకేజ్డ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు కూడా దూరంగా ఉంటారు. వీరు కేక్‌లు, కుకీలు, చాక్లెట్స్, పుట్టగొడుగులతో తయారైనవి లాంటి వాటికి కూడా దూరంగా ఉంటారు. వాటి షెల్ఫ్‌లైఫ్ పెంచే ప్రక్రియలో, తయారీ ప్రక్రియలో జంతుసంబంధాలను ఉపయోగించి ఉంటారేమోనన్న భయం ఇందుకు కారణం. చీజ్ లాంటి వాటి తయారీలో చాలా దేశాల్లో జంతు సంబంధాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఆ విషయం తెలియని వారు వాటిని ఆహారంగా వినియోగిస్తూ ఉంటారు.
ఒరిస్సాలో శాకాహారులు సైతం జలపుష్పాల (చేపలు)ను ఆహారంగా స్వీకరిస్తుంటారు. అమెరికా ప్రభుత్వ విభాగాలు విడుదల చేసిన డయటరీ గైడ్‌లైన్స్ ఫర్ అమెరికన్స్ (2010) నివేదిక ప్రకారం మాంసాహారుల కంటే కూడా శాకాహారులే మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. శాకాహారుల్లో స్థూలకాయం తక్కువ. గుండెవ్యాధులు కలిగే అవకాశాలు కూడా తక్కువే. శాకాహారం బీపీని పెంచకుండా చూస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బాడీ మాస్ ఇండెక్స్ కూడా తక్కువే. నిజానికి శాకాహారంలోనూ మరెన్నో ఉపతెగలు ఉన్నాయి. కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.
కానీ మాంసాహారం కంటే వెజిటే రియన్ డైట్‌తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చదవండి. వెజిటబుల్ డైట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచుపదార్థాలు. పాలకూర, క్యాబేజీ, సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం. మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే. శరీరంలో నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. నాన్‌వెజ్‌లో ఫైబర్ లభించదు. ధృడమైన ఎముకలు:మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది.
ఎముకలు బలహీనంగా మారుతాయి. శాకాహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే. నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్‌కు దారితీస్తుంది. అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కరిగించుకొంటుంది. అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి. అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. బీట్రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు. కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటమే. మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు. అయితే నాన్‌వెజ్‌కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు.
ఇవి వెజిటేరియన్ డైట్లో మాత్రమే లభిస్తాయి. నాన్‌వెజ్ తీసుకునే వారిలో వీటికి కొరతేఉంటుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది. అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు. శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి.
ఏమిటిలా చిక్కిపోతున్నావ్? అని ఎవరైనా ప్రశ్నిస్తే, గుడ్లా? మాంసమా? చిక్కిపోక ఏం చేస్తాం? అంటూ ఎదురుప్రశ్న వేస్తుంటారు. చిక్కిపోవడానికి గల అసలు కారణాల గురించి ఏ మాత్రం ఆలోచన ఉండదు. ఆకుకూరలు, కాయగూరలు తినడమే అసలు లోపం అన్నట్లుగా వారి ధోరణి ఉంటుంది. నిజానికి మనిషికి అవసరమైన అన్ని పోషకాలు, ప్రొటీన్లు శాకాహారంలోనూ సంపూర్ణంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. సిసలైన పౌష్టికాహారం అంటే మాంసాహారమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే మాంసాహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అంతిమంగా ఈ ఆహారపు అలవాట్లు జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తాయి. శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు.
ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి. మాంసాహారం మీద ప్రీతితో అంతే మోతాదులో తీసుకుంటూ పోతే అవి జీర్ణం కావు. ఆకలి మందగించడంతో పాటు కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. పౌష్టికాహారం పేరిట అదేపనిగా మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది. శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది. శరీరతత్వంలో కొన్ని చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ఆకలి మందగించడం, కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. మాంసాహారం, గుడ్లు పూర్తిగా మానకోవాలని కాదు. ఒక పరిమితిలో వాటిని తీసుకోవచ్చు. అయితే, మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తాయనుకోవడం సరికాదు. శాకాహారం నుంచి కూడా అవసరమైన ప్రొటీన్లతో పాటు పోషకపదార్థాలన్నీ లభిస్తాయి. పెద్దవారికి ఇవి అవసరానికంటే ఎక్కువే. వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తరుచూ వీటిని ఉపాహారంగా (బ్రేక్‌ఫాస్ట్) తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతో పాటు లవణాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.పైగా వీటిని జీర్ణించుకోవడంలో శరీరానికి ఎక్కువ శక్తి కూడా ఖర్చు కాదు. మొలకెత్తించే విధానం గింజలను నీటిలో నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి.
ఆ తరువాత వాటిని తడిగుడ్డలో మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. కొంచెం గాలి తగిలేలా మూత కాస్త తెరిచి పెట్టాలి. సాధారణంగా 12 నుంచి 16 గంటల వ్యవధిలో ఇవి మొలకెత్తుతాయి. చలికాలంలో అయితే 24 గంటల దాకా పట్టవచ్చు. శరీరానికి కావలసిన ఎన్నో పౌష్టిక విలువలు, ప్రొటీన్లను వీటి ద్వారా పొందవచ్చు. వేరుశనగ గింజలను పన్నెండు గంటలపాటు నానబెట్టాలి. ఆ తరువాత నీరు తీసివేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని హానికారక అంశాలన్నీ తొలగిపోతాయి. ఈ వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది. క్యారెట్, కీర, బీట్రూట్, ఉల్లి, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. అప్పుడప్పుడు పచ్చి బఠాణి, రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవచ్చు. టమాటకు బదులుగా నిమ్మరసం కలుపుకోవచ్చు.
సలాడ్ తినడానికి చాలా ముందు ఉప్పు కలిపి పెడితే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తరువాత ఒకరకమైన వాసన వస్తుంది. కాబట్టి తినే సమయంలో మాత్రమే ఉప్పు కలుపుకోవాలి. రాత్రిపూట ఆహారంతో పాటు తీసుకుంటే చాలా మంచిది. పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది. రక్తహీనత తగ్గడంతో పాటు రక్తస్రావ సమస్యలు కూడా నయమవుతాయి. వీటితో పాటు నానబెట్టిన ఎండు ద్రాక్ష, అత్తిపండు, నానబెట్టిన బాదం, నల్లరకం ఎండు ఖర్జూరం తీసుకోవడం శ్రేయస్కరం.


