ఆరోగ్య పరిరక్షణ అవసరం: డీవార్మింగ్ డేలో డియమ్హెచ్ఓ
కాకినాడ: పాఠశాల విద్యార్ధులు, విద్యతో బాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.చంద్రయ్య సూచించారు. రాష్ట్రీయ బాలల ఆరోగ్య కార్యక్రమం క్రింద కాకినాడ శ్రీరామ్నాగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో డీవార్మింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్ధులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ను ఆయన అందచేసారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్దులు భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కొవాలని, శరీరంలో ఉండే నులి పురుగుల నివారణకు ప్రతీ 6 నెలలకొకసారి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ మున్సిపల్ అదనపు కమీషనర్ యస్.గోవింద స్వామి మాట్లాడుతూ విద్యార్ధులు పౌష్టికాహారం తీసుకోవడంతోబాటు తరచూ వచ్చే అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత, నిర్ణీత వ్యాధి నిరోధక మందులు తీసుకోవడం ద్వారా విద్యార్ధులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పౌరసంబందాధికారి ఎం.ఫ్రాన్సిస్ మాట్లాడుతూ విద్యార్ధులు ఆరోగ్య నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జవహర్ బాల ఆరోగ్య రక్షా కో-ఆర్డినేటర్ డా. యన్.రాజేశ్వరి, పాఠశాల హెడ్మాస్టర్ మహమ్మద్ రబ్బానీ, జిహెచ్ఇ సూర్యచంద్రరావు, డెమో తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాలలోని విద్యార్ధినీ, విద్యార్ధులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చశారు.


