ఆర్థిక సరళీలకరణకు భారత్ సాక్షి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఆర్థిక సరళీకరణకు భారత్ సాక్షిగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం వేగంగ అభివృద్ధి చెందుతున్న దేశమని ఆయన అన్నారు. బుధవారంనాడు కౌలాలంపూర్లో వాణిజ్య సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. 21వ శతాబ్ధం ఆసియా దేశాలదేనని అన్నారు.
బలమైన ఆర్థి శక్తిగా ఎదిగేందుకు ఆసియా దేశాలు సంఘటితంగా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. విఫ్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలో భారత్ ముందుకు వెళ్లోందని అన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో జీఎస్టీని అమలు చేస్తున్నామని అన్నారు. పన్నుల సంస్కరణలో ఇది అతిపెద్ద నిర్ణయమని చెప్పారు. ఆర్థిక సరళీకరణతో భారత్ ముందుకు సాగుతోందని అన్నారు.
అవినీతి, నల్లధనం నిర్మూలనకు భారతదేశం పెద్దపీట వేసిందని అన్నారు. నగదు రహిత లావాదేవీల దిశగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. నల్లధనం అరికట్టడం ద్వారా అవినీతిని నిర్మూలించవచ్చునని అన్నారు. నల్లధనం బయట పడితే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చునని అన్నారు. తద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని అన్నారు.
నల్లధనం అరికట్టడంలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేశామని, ఇది ఒక విఫ్లవాత్మక నిర్ణయం అని ప్రధాని అన్నారు. మలేషియా దేశంలో సంత్సంబంధాలను నెలకొలుపుతున్నామని ఆయన అన్నారు. కౌలాలంపూర్లో తోరణం ఇరుదేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. ఇరుదేశాల సంస్కృతులకు ఈ తోరణం చిహ్హనంగా వెలుగుతోందని అన్నారు.


