ఆర్ఐడిఎఫ్ నిధులతో 650 అంగన్వాడీ భవనాలు
- 72 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో నాబార్డు ఆధ్వర్యంలో ఆర్ఐడిఎఫ్ నిధులు ద్వారా 650 అంగన్వాడీ భవనాలకు ప్రతిపాదనలను తయారు చేసి సమర్పించాలని ఐసిడియస్ అధికారులను జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. మరో 650 అంగన్వాడీ భవనాలు ఐసిడియస్ నిధులు ద్వారా నిర్మాణం చేపడతామని కలెక్టరు చెప్పారు.
జిల్లాలో మొత్తం 1300 అంగన్వాడీ భవనాల నిర్మాణం పూర్తి చేసిన ఎడల నిర్ధేశించిన లక్ష్యం సాధించగలుగుతామని త్వరితగతినే ఈప్రతిపాదనను సమర్పించిన ఎ డల పనులను ప్రారంభిం చడం జరుగుతుందని కలెక్టరు చెప్పారు. పంచాయతిశాఖ ద్వారా చేపట్టే గోపాలమిత్ర భవనాల నిర్మాణం సెప్టెంబరు నెలాఖరు నాటికి మరియు రైతుల శిక్షణా కేంద్రం నరసాపురం భవనాలు అక్టోబరు నాటికి పూర్తి చేయాలని యస్ఇ పిఆర్ శ్రీ మాణిక్యాన్ని కలెక్టరు ఆదేశించారు. జిల్లాలో 29 రోడ్లు నిర్మించవలసి ఉండగా వాటిని ఏఏ రోడ్డు ఎక్కడ నిర్మిస్తున్నదీ వాటి వివరాలను ఇవ్వాలని వర్షం మూలంగా పనులను నెమ్మదిగా జరుగుతున్నాయని యస్ఇ చెప్పగా డిశంబరు నాటికి పూర్తి చేయాలని యస్ఇని కలెక్టరు ఆదేశించారు.
ఆర్అండ్బి ద్వారా పనులను ఏమాత్రం శ్రద్ధవహించట్లేదని సెప్టెంబరు 14వ తేదీన టెండర్లు ఖరారు చేయాల్సి ఉండగా ఇప్పటివరకూ ఏపనులకు కూడా టెండర్లను ఖరారు చేయకపోవడానికి కారణాలేంటని ఇఇ భీమవరం ఆర్అండ్బి విజయరత్నంను కలెక్టరు నిలదీసారు. ఆర్అండ్బి వారు ఏది అడిగినా చీఫ్ ఇంజినీరు వద్ద ఉన్నాయని చెప్పి కుంఠిసాకులు చెబుతున్నారని వారంవారం కాలయాపన చేయడమే కానీ మేమాసం నుంచి తరచుగా పనులపై సవిూక్షించినా కూడా పనుల పురోగతి మాత్రం పర్యవేక్షించడం లేదని కలెక్టరు ఆర్అండ్బి అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేసారు. ఇకపై వారు సమావేశానికి వచ్చినప్పుడు పూర్తి సమాచారం లేకుండా రాకూడదని లేదా సంబంధించిన పై అధికారులు వచ్చి వివరాలు ఇవ్వవలసి ఉంటుందని కలెక్టరు చెప్పారు.
85 లక్షల రూపాయలతో ఆక్వాల్యాబ్ ఏలూరు, భీమవరంలలో పనులను నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిందిగా కలెక్టరు సంబంధితాధికారులను ఆదేశించారు. వెంకట్రామన్నగూడెంలో జిల్లా లైవ్ స్టాక్ డవలప్మెంట్ ఏజెన్సీ భవనాన్ని అక్టోబరు మొదటివారంలో పనులు మొదలు పెట్టడానికి శంఖుస్ధాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టరు హార్టికల్చర్ యూనివర్సిటీ అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ వారి వెటర్నరీ ఆసుపత్రులు ఉండి, పోలవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడిలలో 35.95 లక్షల వ్యయంతో ఈభవనాలన్నింటికీ త్వరితగతినే టెండర్లను ఖరారు చేయాల్సిందిగా కార్పోరేషన్ అధికారులను కలెక్టరు ఆదేశించారు.
ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఎర్రకాల్వ పనులు 25 శాతం మాత్రమే పూర్తయ్యిందని అక్కడ నీరుండడం వలన పనులు ముందుకు సాగడం లేదని ఏఇ ఇరిగేషన్ చెప్పగా కలెక్టరు ఇంకా ఎన్నాళ్లలో ఈపనిని పూర్తి చేస్తారని కలెక్టరు ప్రశ్నించారు. లక్షా 60 వేల క్యూబిక్ విూటర్ల వర్క్ ఇంకా ఉన్నదని చెప్పగా ఫిబ్రవరి 15, 2017కల్లా పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశాలు జారీ చేసారు. నాబార్డు ఆర్ ఐడిఎఫ్ల నిధులు ద్వారా ఆమోదించిన పనులను పనివారీగా దాని వ్యయం, ఎక్కడ పనులను చేయిస్తున్నారు ఆవివరాలను ఒక నివేదిక రూపంలో సమర్పించవలసిందిగా నాబార్డు డిడిఎం రామప్రభును కలెక్టరు ఆదేశించారు.
సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఆర్ ప్రొటెక్టడ్ కల్టివేషన్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఇన్క్లూడింగ్ ఆటోమేటెడ్ ఫ్లగ్ టైప్ సీడింగ్ ప్రొడక్షన్ ఆర్ఐడియఫ్ నిధులు ద్వారా వెంకట్రామన్నగూడెం ఉద్యాన యూనివర్సిటీలో 13 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. పది లక్షల నారు కూరగాయలు, పువ్వుల నారు పెంపకాలు అవగాహన కొరకు పూర్తి ఆటోమేటెడ్ సాంకేతికపరంగా రూపొందించబడింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రక్రియను ఈ యూనివర్సిటీలో రూపొందించడం జరిగింది. ఈపాలీ హౌస్లోఇదేకాకుండా స్ట్రక్చర్స్ నిర్మించి ఉన్నారు.
దానిలో క్యాప్సికమ్, యూరోపియన్ దోస సాగు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా పరిశోధన కొరకు ఉపయోగిస్తారు. రైతు తనకు కావాల్సిన విత్తనాలు వెరైటీని అందించిన ఎడల నారుకు 40 పైసలు చొప్పున తీసుకుని రైతుకు ఇవ్వడం జరుగుతుంది. రైతు ఈక్షేత్రాన్ని రైతులు సందర్శించి వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునే విధంగా ఈప్రక్రియ ఉపయోగపడుతుందని కలెక్టరు చెప్పారు.
ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానేశ్వర్ రావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ మాణిక్యం, ఐసిడియస్ ఏపిఓ, ఇరిగేషన్ డిఇ, ఇఇ ట్రైబల్ వెల్ఫేర్, ఏఇ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ దినేష్, మార్టేరు యూనివర్సిటీ సైంటిష్టు మణికుమార్, యస్యు యూనివర్సిటీ సెంటర్ ప్రొఫెసర్ సృజన, ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ ఉండి, పశువుల పరిశోధనా కేంద్రం అధికారి డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


